బిగ్ బాస్ 9.. హౌస్ లోకి మరో ముగ్గురు కామనర్స్..?
బిగ్ బాస్ సీజన్ 9 థర్డ్ వీక్ లో సూపర్ ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. సీజన్ 9 లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ గా కంటెస్టెంట్ ఎంపిక జరిగింది.
By: Ramesh Boddu | 23 Sept 2025 1:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 థర్డ్ వీక్ లో సూపర్ ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. సీజన్ 9 లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ గా కంటెస్టెంట్ ఎంపిక జరిగింది. ఐతే ఇందులో భాగంగానే హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీ, ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి వచ్చారు. ఐతే మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవగా రెండో వారం కామనర్స్ నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో 3 వ వారం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ఈ వారం లోనే మరో ముగ్గురు లేదా నలుగురు హౌస్ లోకి రాబోతున్నారట. ఈ సీజన్ లో కామనర్స్ ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు.
ముగ్గురు కామనర్స్ ని హౌస్ లోకి..
బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేసి ఆరుగురు కామనర్స్ వచ్చారు. ఐతే వారిలో రెండో వారం మనీష్ బయటకు వచ్చాడు. ఈ వారం కూడా మరో కామనర్ హౌస్ నుంచి బయటకు వస్తారనే టాక్ ఉంది. అందుకే ఈ వారం మరో ముగ్గురు కామనర్స్ ని హౌస్ లోకి పంపించే ప్లానింగ్ లో ఉన్నారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం సీజన్ 9 లో కంటెస్టెంట్ గా కామనర్స్ లో నాగ ప్రశాంత్, షాకీబ్, దివ్య నిఖిత వస్తారని టాక్. వీరితో పాటు మరో కామనర్ అనూషకి కూడా ఛాన్స్ ఉందని టాక్.
బిగ్ బాస్ సీజన్ 9 మొదలవడానికి ముందే అగ్నిపరీక్ష ద్వారా టాప్ 13లో వీళ్లు వెళ్లారు. ఐతే షాకీబ్, దివ్య, నాగ ప్రశాంత్ వీరు ముగ్గురు కూడా హౌస్ లోకి వెళ్లేలా ఉన్నారు. ఐతే వీళ్లని వైల్డ్ కార్డ్ గా తెస్తారా లేదా అలా వెళ్లి ఇలా బయటకు వచ్చేస్తారా అన్న టాక్ నడుస్తుంది. సర్ ప్రైజ్ గా మరో ముగ్గురు కామనర్స్ ని హౌస్ లోకి పంపించి అక్కడ ఒకరిని హౌస్ లో ఉండేలా సర్ ప్రైజ్ చేస్తారని టాక్.
దసరా టైం లో గ్రాండ్ లాంచ్..
సో బిగ్ బాస్ సీజన్ 9 లో మరో కామనర్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్ ని దసరా టైం లో ఉంటుందని టాక్. దసరా టైం లో గ్రాండ్ లాంచ్ గా సీజన్ 9 2.O కూడా ఉండబోతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా కామనర్స్ హౌస్ లోకి రావడం అగ్నిపరీక్ష ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
