అతనొక అమ్మాయిల పిచ్చోడు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వైరల్ కామెంట్స్..!
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో హౌస్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడు లేనిది ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని స్ట్రాంగ్ పీపుల్ ని పంపించాడు బిగ్ బాస్ టీం.
By: Ramesh Boddu | 14 Oct 2025 11:06 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో హౌస్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడు లేనిది ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని స్ట్రాంగ్ పీపుల్ ని పంపించాడు బిగ్ బాస్ టీం. అలా సండే ఎపిసోడ్ పూర్తయిందో లేదో ఇలా నెక్స్ట్ డేనే గొడవలతో హౌస్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చేలా చేశారు. కిచెన్ డిపార్ట్ మెంట్ లో కళ్యాణ్, మాధురి, దివ్య గొడవ పడ్డారు. హెడ్ చెఫ్ బాధ్యత తీసుకున్న మాధురి బ్రేక్ ఫాస్ట్ విషయంలో లేట్ చేసిందని కళ్యాణ్, దివ్య ఆమెతో మాట్లాడుతున్న టైంలో చిన్న మాట మాట పెరిగింది. మాధురి వర్సెస్ కళ్యాణ్, దివ్య అన్నట్టుగా వాదన జరిగింది.
కళ్యాణ్ గురించి రమ్య మోక్ష కూడా కామెంట్స్..
మధ్యలో భరణి వచ్చి వాళ్లకి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా కళ్యాణ్ వచ్చి మాధురికి సారీ చెప్పాడు. మాధురి మాటలు చాలా వెటకారంగా ఉన్నాయని కళ్యాణ్ అన్నాడు. మీరలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అన్నడు కళ్యాణ్. అక్కడ వాదన మొదలైంది. ఇక ఆ టైంలోనే కళ్యాణ్ గురించి రమ్య మోక్ష కూడా కామెంట్స్ చేసింది. మాధురి, రమ్య ఒక చోట కూర్చుని కళ్యాణ్ గురించి మాట్లాడారు.
శ్రీజ అతని ఫ్రెండ్ కాబట్టి ఆమె బెలూన్ కట్ చేయగానే కళ్యాణ్ తన వైపుకి కూడా చూడలేదని రమ్య చెప్పింది. అంతేకాదు తనూజ మీద చేతులు వేసి టచ్ చేసినట్టుగా తనను చేస్తే మాత్రం కిందేసి తొక్కుతా అని అన్నది రమ్య మోక్ష. అతనొక అమ్మాయిల పిచ్చోడని సంచలన కామెంట్స్ చేసింది రమ్య మోక్ష. మాధురి కూడా తనూజ లీనియన్స్ ఇస్తుంది కాబట్టే అతను అలా చేస్తున్నాడని అన్నది. సో కళ్యాణ్ గురించి హౌస్ లో ఉన్న వారి అభిప్రాయం ఎలా ఉన్నా వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారి ఒపీనియన్ ఇలా ఉందన్నమాట.
ఆట కోసం ఎవరు ఎలాంటి ఎత్తుడలైనా వేయొచ్చు..
బిగ్ బాస్ హౌస్ లో ఆట కోసం ఎవరు ఎలాంటి ఎత్తుడలైనా వేయొచ్చు. కానీ దాన్ని పర్సనల్ గా తీసుకోకూడదు. అలానే అవతల వ్యక్తి మీద పర్సనల్ ఎలిగేషన్స్ వేయకూడదు. నచ్చిన వ్యక్తి దగ్గర ఉంటూ నచ్చకపోతే వారికి దూరంగా ఉండటమే తప్ప హౌస్ లో ఉన్న ఒక వ్యక్తి గురించి అమ్మాయిల పిచ్చోడు అనే కామెంట్స్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. రమ్య మోక్ష హౌస్ లో తన మార్క్ చూపించాలని ఎక్కువ గొడవలు పెడితే తనకు అంత ప్లస్ అవుతుందని భావిస్తుంది. అందుకే ఇలా కళ్యాణ్ మీద ఎటాకింగ్ మొదలు పెట్టిందని అంటున్నారు.
