బిగ్ బాస్ 9.. నాగార్జున క్లాస్ కి సౌండ్ లేదంతే..!
బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆట చూస్తాం.. వీకెండ్ వాళ్ల ఆటకి హోస్ట్ మన కింగ్ నాగార్జున రివ్యూని చూసేస్తాం.
By: Ramesh Boddu | 19 Oct 2025 9:42 AM ISTబిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆట చూస్తాం.. వీకెండ్ వాళ్ల ఆటకి హోస్ట్ మన కింగ్ నాగార్జున రివ్యూని చూసేస్తాం. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అందులో తప్పెవరిది అంటూ అటు తన ఒపీనియన్ చెబుతూ హౌస్ ఒపీనియన్ తో పాటు ఆడియన్స్ రియాక్షన్ కూడా చూపిస్తారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం వీకెండ్ నాగార్జున కొంతమంది హౌస్ మెట్స్ కి సూపర్ క్లాస్ పీకాడు. నాగార్జున మాట్లాడుతుంటే వాళ్లకు సౌండ్ లేదన్నంత పని అయ్యింది.
ఇలాంటి అనవసరమైన మాటలు ఆపండి..
ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ లో మాధురి, రమ్య కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, తనూజ గురించి చేసిన డిస్కషన్ ని వాళ్లకి చూపించి మాట్లాడే మాట మనల్ని అందలం ఎక్కిస్తుంది అంటూ ఒక విధంగా ఇలాంటి అనవసరమైన మాటలు ఆపండి అన్నట్టుగానే చెప్పాడు. రమ్య, కళ్యాణ్ లను కన్ ఫెషన్ రూం కి పిలిచి మరీ వీడియో చూపించాడు నాగార్జున. అందులో రమ్య కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడు అనడం చూపించి అతన్ని జీవితం మొత్తం చూశావా అలా అనకూడదు అంటూ చెప్పాడు.
ఇక తనూజకి కూడా మాధురి, రమ్య రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేలా మాట్లాడటం చూపించి నీ వెనకాల ఏం జరుగుతుందో చూసుకో అని హింట్ ఇచ్చారు. మాధురి తన వాయిస్ ఇంతే అని నాగార్జునకు చెప్పగా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావ్ కదా అలానే వాళ్లతో మాట్లాడు అంటారు నాగార్జున. ఇక ఫైర్ స్టోర్మ్ కి ఇచ్చిన కిరీటంలో మాధురి, నిఖిల్ కిరీటం తో పాటు వాళ్లకి ఇచ్చిన స్పెషల్ పవర్ ని తిరిగి వెనక్కి తీసుకున్నారు.
రమ్య, అయేషా, శ్రీనివాస్ సాయి దగ్గర ఉన్న పవర్స్..
రమ్య, అయేషా, శ్రీనివాస్ సాయి దగ్గర ఉన్న పవర్స్ అలానే ఉంచారు. ఇక వైల్డ్ కార్డ్ గా వచ్చి కెప్టెన్ అయినందుకు గౌరవ్ ని నాగార్జున మెచ్చుకున్నారు. సుమన్ శెట్టి ఆటని కూడా అభినందించారు నాగార్జున. మొత్తానికి హౌస్ లో ప్రతి చిన్న దానికి గొడవ పడకండి అంటూ చెప్పారు. ఇక కన్ ఫెషన్ రూం లోకి మరో జంట అదే రీతు, డీమాన్ పవన్ లను పిలిచి రమ్య, డీమాన్ పవన్ మాట్లాడటం చూపించారు. ఇప్పుడు మీ ఇద్దరి మైండ్ లో ఏం నడుస్తుందని రీతు, పవన్ ఇద్దరిని నాగార్జున అడిగారు. రీతు చాలా క్లారిటీగానే ఉంది. కానీ పవన్ చెప్పిన వాటికి ఆడియన్స్ 100 పర్సెంట్ థంస్ డౌన్ చేశారు.
మొత్తానికి ఆడియన్స్ పోల్ తో వాళ్ల యాక్షన్, రియాక్షన్ ఎలా ఉందో చూపించారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ప్రతి విషయాన్ని చర్చించి దాని గురించి హౌస్ మెట్స్ కి క్లారిటీ వచ్చేలా మాట్లాడటం ఆడియన్స్ ని అలరిస్తుంది.
