బిగ్ బాస్ 9.. రోజా ముల్లులు ఇచ్చి మాధురి మాస్ ర్యాగింగ్..!
బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ మాధురి ఎలిమినేషన్ జరిగింది. నవంబర్ 02 ఆదివారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో మాధురి, గౌరవ్ వచ్చారు.
By: Ramesh Boddu | 3 Nov 2025 10:14 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ మాధురి ఎలిమినేషన్ జరిగింది. నవంబర్ 02 ఆదివారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో మాధురి, గౌరవ్ వచ్చారు. ఇద్దరినీ కారులో తీసుకెళ్లి ఒకరిని డైరెక్ట్ ఎలిమినేట్ చేసి.. మరొకరిని మళ్లీ కారులో హౌస్ లోకి తీసుకొచ్చారు. అలా గౌరవ్ తిరిగి హౌస్ లోకి వెళ్లగా మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన మాధురిని ఎక్స్ పెక్ట్ చేశావా అని అడిగితే.. వచ్చేద్దామనే అనుకున్నా అని అన్నది. ఎందుకంటే మా ఆయన బర్త్ డే 4న ఉంది అందుకే వచ్చేశా అని అన్నది మాధురి.
తనూజని బంగారం అంటూ..
ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్న మాధురి హౌస్ లో 3 రోజ్ ఫ్లవర్స్, 3 ముళ్లులు ఇవ్వమని హోస్ట్ నాగార్జున అన్నారు. ఇందులో భాగంగా 3 రోజ్ ఫ్లవర్స్ లలో మొదటిది మాధురి తనూజకి ఇచ్చింది. తనూజని బంగారం అంటూ సంబోధించింది మాధురి. తనూజ చాలా మంచి అమ్మాయి ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతుంది. తను బయటకు అలా కనిపిస్తుంది కానీ చాలా స్వీట్ అని అన్నది మాధురి. ఆమె తర్వాత కళ్యాణ్ కి రోజ్ కేటగిరిలో పెట్టింది. అతను కూడా చాలా స్వీట్ అని మంచి వాడని అన్నది మాధురి.
ఇక 3వ రోజ్ డీమాన్ పవన్ కి ఇచ్చింది మాధురి. పవన్ కూడా చాలా స్ట్రాంగ్ మంచి వాడని మాధురి తన 3 రోజెస్ గురించి చెప్పింది. ఇక ముళ్లు ఇవ్వమని నాగ్ చెప్పగా భరణికి ఒక ముళ్లు ఇచ్చింది మాధురి. ఆయన ఇంకా సేఫ్ ఆడుతున్నాడని.. మాస్క్ తీయట్లేదని అన్నది. మరో ముళ్లును దివ్యాకి ఇచ్చింది మాధురి. ఈమె కూడా అంతే మాస్క్ తో ఆడుతుందని చెప్పింది మాధురి.
వెళ్తూ వెళ్తూ ముళ్ల రోజాలు ఇచ్చిన మాధురి..
వెళ్తూ వెళ్తూ ముళ్ల రోజాలు ఇచ్చి మాస్ ర్యాగింగ్ చేసింది మాధురి. భరణి అయితే అసలు హౌస్ లో ఉండే అర్హత లేదన్నట్టుగా ఆమె మాట్లాడింది. తప్పకుండా మాధురి ఇన్ పుట్స్ వాళ్లు తీసుకుని ఆట మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఆల్రెడీ భరణికి నాగార్జున కూడా సేఫ్ ఆడటం మానేసేయ్ అని చెప్పాడు. కానీ భరణి మాత్రం ఇంకా తనూజ, దివ్య ఇద్దరి మధ్య ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.
మాధురి ఎలిమినేషన్ తనూజకి ఓ విధంగా ప్లస్ అనిపించినా మరో విధంగా మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె అలిగినప్పుడు మాధురి తినిపిస్తుంది. నేను వెళ్తున్నా నువ్వు అలగకు అని చెప్పింది మాధురి. ఐతే వెళ్లేప్పుడు మాధురి కాస్త ఎమోషనల్ గా కనిపించడం విశేషం. అంతేకాదు తన బిగ్ బాస్ జర్నీ చూసుకున్న తర్వాత మాధురి చాలా సంతృప్తిగా కనిపించారు.
