ఇమ్మాన్యుయేల్ మాస్టర్ మైండ్.. గౌరవ్ డీకోడ్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ మాస్టర్ మైండ్ తో ఆడుతున్నాడు. అతను హౌస్ లో ప్రతి టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూనే తన ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నాడు.
By: Ramesh Boddu | 7 Nov 2025 10:44 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ మాస్టర్ మైండ్ తో ఆడుతున్నాడు. అతను హౌస్ లో ప్రతి టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూనే తన ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నాడు. ఈ సీజన్ లో టాప్ 5 లో కాదు కాదు టాప్ 3లో ఇమ్మాన్యుయెల్ పక్కా అని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఐతే ఒక్కోసారి ఇమ్మాన్యుయెల్ వేస్తున్న ఎత్తుగడలకు మిగతా హౌస్ మెట్స్ నుంచి ఎటాకింగ్ జరుగుతుంది. తాజాగా కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఇమ్మాన్యుయెల్ ఆరెంజ్ టీం లో ఉండి జరిగిన 3 టాస్క్ లల్లో రెండు కాంబినేషన్ లో ఆడి గెలిచాడు. మొదటి ఆట రాము, ఇమ్మాన్యుయెల్ ఆడి గెలవగా.. రెండోది గౌరవ్, ఇమ్మాన్యుయెల్ ఆడి గెలిచారు.
గ్రీన్ సేఫ్ కార్డ్ రాముని కాదని ఇమ్మాన్యుయెల్..
ఐతే మొదటిసారి గ్రీన్ సేఫ్ కార్డ్ రాముని కాదని ఇమ్మాన్యుయెల్ తీసుకున్నప్పుడు అదే ఆరెంజ్ టీం లో ఉన్న గౌరవ్ ఏమి మాట్లాడలేదు. ఇక రెండో టాస్క్ తనూజ తనే ఆడింది కాబట్టి ఆమె తీసుకుంది. అప్పుడు కూడా గౌరవ్ ఏమి మాట్లాడలేదు. కానీ 3వ టాస్క్ గౌరవ్ తో పాటు ఇమ్మాన్యుయెల్ ఆడాడు. ఐతే ఆ టైం లో గౌరవ్ తనకు గ్రీన్ సేఫ్ కార్డ్ కావాలని అడిగితే ఇమ్మాన్యుయెల్ నాకు కూడా కావాలని వాదన జరిపాడు. తాను రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేనని ఇమ్మాన్యుయెల్ చెప్పాడు.
గౌరవ్ కూడా నువ్వు ఒక్కసారి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేవు కానీ నేను 3 రౌండ్ల నుంచి రిస్క్ తీసుకుంటున్నా అని ఇమ్మాన్యుయెల్ కి చెప్పాడు. ఈ ఫైట్ లో తెలిసింది ఏంటంటే ఇమ్మాన్యుయెల్ మళ్లీ కెప్టెన్ గా అవ్వాలని అనుకుంటున్నాడు అని.. ఇక ఫైనల్ గా ఈ వారం కెప్టెన్సీ రేసులో భరణి, రీతు, ఇమ్మాన్యుయెల్, తనూజ, దివ్య, సుమన్ ఉండగా వారిలో నుంచి ఇమ్మాన్యుయెల్ మళ్లీ కెప్టెన్ అయ్యాడని లీక్స్ బట్టి తెలుస్తుంది.
డైరెక్ట్ గా టాప్ 5లోకి వెళ్లాలని..
దాదాపు జరిగిన 9 వారాల్లో ఇమ్మాన్యుయెల్ అసలు నామినేషన్స్ లోకి రాకుండా డైరెక్ట్ గా టాప్ 5లోకి వెళ్లాలని చూస్తున్నాడు. ఈ వారం కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ లేదు. ఎలాగు అతని దగ్గర పవర్ అస్త్ర కూడా ఉంది. సో ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ అసలు నామినేషన్స్ లోకి రాకుండా సీజన్ మొత్తం నడిపించాడు.
ఐతే గౌరవ్ మాత్రం ఇమ్మాన్యుయెల్ ప్లాన్ ని కనిపెట్టాడు. ఎంటర్టైన్ చేస్తూ టాస్క్ లు ఆడుతుంటే తనే స్ట్రాంగ్ అని ఇమ్మాన్యుయెల్ ఫీల్ అవుతున్నాడని గౌరవ్ గుర్తించాడు. అందుకే అతనితో ఫైట్ కు రెడీ అన్నట్టుగా సిద్ధమని హింట్స్ ఇస్తున్నాడు
