డీమాన్ పవన్ ఆట ఇది.. రీతుతో మాత్రం నాట్ ఇంప్రెసివ్..!
ఐతే అసలు పవన్ కాలిబర్ ఏంటన్నది చెప్పేలా నిన్న జరిగిన రింగ్ టాస్క్ చూపించింది. భరణి, గౌరవ్ తనని ఎంత ఆపాలని చూసినా సరే ఆ టాస్క్ లో డీమాన్ పవన్ తన పొటెన్షియన్ ఏంటో చూపించాడు.
By: Ramesh Boddu | 30 Oct 2025 10:54 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో బాడీ ఫిట్ గా ఎలాంటి టాస్క్ అయిన గెలిచే సత్తా ఉన్న వాడిలా కనిపించాడు డీమాన్ పవన్. బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామనర్స్ నుంచి అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన పవన్ తను ఆట మీద కాన్సెంట్రేట్ చేస్తే ఎలాంటి గేం అయినా ఆడతాడు. కానీ రీతుతో పులిహోర కార్యక్రమాలే అతన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. ఈమధ్య రీతు, పవన్ మధ్య గొడవలు కూడా వరుసగా జరుగుతున్నాయి. తన కోసం ప్రతి విషయంలో ఎక్కడో ఒకచోట సపోర్ట్ గా ఉంటున్న రీతు విషయంలో పవన్ కాస్త డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు. రీతు కూడా ప్రతి రోజు పవన్ తో గొడవ పడుతూ వాదన జరుపుతుంది.
డీమాన్ పవన్ పొటెన్షియన్ ఏంటో..
ఐతే అసలు పవన్ కాలిబర్ ఏంటన్నది చెప్పేలా నిన్న జరిగిన రింగ్ టాస్క్ చూపించింది. భరణి, గౌరవ్ తనని ఎంత ఆపాలని చూసినా సరే ఆ టాస్క్ లో డీమాన్ పవన్ తన పొటెన్షియన్ ఏంటో చూపించాడు. ముందు నుంచి డీమాన్ పవన్ గురించి ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కూడా అవే అవ్వడంతో బిగ్ బాస్ ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ఇది కదా అసలు డీమాన్ పవన్ స్టామినా అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ ఆట పరంగా ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వచ్చాడు. ఐతే పవన్ ఆటని సపోర్ట్ చేస్తున్నా అనుకుంటూ పక్కనే ఉంటున్న రీతు ఓ విధంగా అతనికి అడ్డుగా ఉంది. ప్రతి విషయంలో రీతు అతన్ని ప్రశ్నించడం అతను సమాధానం చెప్పడం ఇద్దరి మధ్య గొడవ జరగడం ఆ తర్వాత కలవడం ఇదే రిపీట్ అవుతుంది. ఇక నిన్న ఈ గొడవ కాస్త పెద్దది అవ్వడంతో రీతు డీమాన్ పవన్ మాట వినకుండా నెట్టేయడం మాత్రం ఆడియన్స్ కు నచ్చలేదు. అఫ్కోర్స్ అది రీతు మీద ఉన్న చనువుతో అనిపించినా ఒక లేడీ కంటెస్టెంట్ ని ఒకసారి కాదు రెండుసార్లు ఇలా నెట్టేయడం కరెక్ట్ కాదు.
రీతు విషయంలో డీమాన్ పవన్..
రీతు విషయంలో డీమాన్ పవన్, అతని విషయంలో రీతు ఇలా ఇద్దరు కాస్త డీప్ గానే వెళ్లినట్టు ఉన్నా కూడా ఏదో భార్య భర్తలు రోజు ఏదో ఒక విషయంలో తగువులాట జరిపినట్టుగా ఈమధ్య వీళ్ల గొడవలు ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా అదే టైప్ కామెంట్స్ వస్తున్నాయి. డీమాన్ ఎలాగు రీసెంట్ టాస్క్ తో తన పవర్ చూపించాడు కాబట్టి ఇక అదే ఫోర్స్ తో మిగతా ఆట కొనసాగిస్తే బెటర్ అని భావిస్తున్నారు.
రీతు కూడా పవన్ ని వదిలి పెట్టి తన ఆట తను ఆడితే కాస్త బాగుంటుంది. అఫ్కోర్స్ లేటెస్ట్ ఫైట్ తో రీతు అదే చెప్పింది కానీ పవనే ఆమెకు దూరంగా ఉండి టాస్క్ ల మీద ఫోకస్ చేస్తే తప్పకుండా తనకున్న స్టామినాకు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. డీమాన్ పవన్ అసలు స్టామినా ఇది అంటూ అతని ఫాలోవర్స్ హంగామా చేస్తున్నా మళ్లీ రీతు వల్ల అతని గ్రాఫ్ పడిపోతే మాత్రం టాప్ 5 ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పొచ్చు.
