Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారంలో ఊహించని పరిణామాల మధ్య ఎలిమినేట్ అయిన టైటిల్ ఫెవరేట్ రోహిత్ మళ్ళీ తిరిగొస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 3 Nov 2026 9:42 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారంలో ఊహించని పరిణామాల మధ్య ఎలిమినేట్ అయిన టైటిల్ ఫెవరేట్ రోహిత్ మళ్ళీ తిరిగొస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి. లైవ్ స్ట్రీమింగ్‌లో భాగంగా రోహిత్‌కు గంతలు కట్టి మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకువస్తున్నట్లుగా ఉన్న ఒక లీక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రీ-ఎంట్రీని చూసి తోటి కంటెస్టెంట్లు షాక్ అయినట్లుగా ఆ విజువల్స్‌లో కనిపిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇది ముమ్మాటికీ అబద్ధమే. ఏదైతే వీడియో సర్క్యులేషన్ లో ఉందో, ఆ వీడియో ఏఐ లో జెనరేట్ చేసిందే.
సాధారణంగా ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే, వీకెండ్ ఎపిసోడ్‌లో వారి జర్నీ వీడియోను ప్లే చేయడం ఆనవాయితీ. కానీ, రోహిత్ ఎలిమినేట్ అయినప్పుడు అలాంటి జర్నీ వీడియోను చూపించకపోవడాన్ని ఆయన అభిమానులు బలంగా పట్టుకుంటున్నారు. రోహిత్ ఖచ్చితంగా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని, అందుకే మేకర్స్ అతని జర్నీ వీడియోను టెలికాస్ట్ చేయలేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వాదిస్తున్నారు.
అయితే ఇందులో ఒక లాజిక్ ఉంది. ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ వోటింగ్ ద్వారా ఎలిమినేట్ అవుతాడో, అప్పుడు అతని జర్నీ ని ప్లే చేస్తారు. కానీ హౌజ్మేట్స్ అభిప్రాయంతో ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం ఆ జర్నీని ప్లే చెయ్యరు.
మరోవైపు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిన రోహిత్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించారు. తన చిన్నారి మేనల్లుడిని ఎత్తుకుని ముద్దులాడుతున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ.. "చాలా రోజుల తర్వాత నా మేనల్లుడితో" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అంతే కాకుండా, బిగ్‌బాస్ హౌస్‌లో తాను గడిపిన భావోద్వేగ క్షణాలతో కూడిన ఒక వీడియోను పోస్ట్ చేసి.. తన ఎలిమినేషన్‌పై ఉన్న తీవ్ర నిరాశను పరోక్షంగా వ్యక్తపరిచారు. ఆ వీడియోకు 'మూవింగ్ ఆన్.. విత్ ఎ హెవీ హార్ట్' అని సింబాలిక్‌గా క్యాప్షన్ ఇస్తూ తన బాధను పంచుకున్నారు.
వైరల్ అవుతున్న లీక్ వీడియోలు, ఫ్యాన్స్ ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ.. రోహిత్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మూవింగ్ ఆన్' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఒకవైపు నెటిజన్లు మాత్రం రోహిత్ మళ్లీ హౌస్‌లోకి రావాలని తీవ్రంగా డిమాండ్ చేస్తుండగా, మేకర్స్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!
