Begin typing your search above and press return to search.

రోహిత్ అమన్ ల మధ్య రగిలిన చిచ్చు

కొద్ది సేపటికి అసలు విషయం గుర్తుకు వచ్చి షాక్ తిన్నాడు. గ్రీన్ లెవెల్‌కు చేరుకున్నప్పటికీ, ఆ పాత శిక్ష కారణంగా అమన్ ఈసారి కెప్టెన్సీ రేసులో పాల్గొనే అవకాశం కోల్పోయాడు.

By:  Priya Chowdhary Nuthalapti   |   31 Oct 2026 9:32 AM IST
రోహిత్ అమన్ ల మధ్య రగిలిన చిచ్చు
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో కెప్టెన్సీ కోసం జరిగిన అల్టిమేట్ గోట్ టాస్క్ మరియు ఆ తర్వాత పరిణామాలు హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేశాయి. గ్రీన్ జోన్‌లోకి అడుగుపెట్టి 'గోట్' స్థాయికి చేరుకున్న అమన్‌కు బిగ్‌బాస్ ఒక భారీ షాక్ ఇచ్చారు. గతంలో అమన్‌కు విధించిన శిక్ష ప్రకారం.. అతను కెప్టెన్సీ రేసు నుంచి పూర్తిగా తొలగించబడ్డాడనే విషయాన్ని అమన్ స్వయంగా మర్చిపోయాడు.

కొద్ది సేపటికి అసలు విషయం గుర్తుకు వచ్చి షాక్ తిన్నాడు. గ్రీన్ లెవెల్‌కు చేరుకున్నప్పటికీ, ఆ పాత శిక్ష కారణంగా అమన్ ఈసారి కెప్టెన్సీ రేసులో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. దీంతో అమన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం ముగ్గురు సపోర్టర్లను ఎంపిక చేసుకోవాల్సి రాగా.. గ్రీన్ జోన్ సభ్యులు చర్చించుకునే క్రమంలో అమన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో రోహిత్, అమన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది కాస్తా పెద్ద గొడవగా మారింది. అయితే ఈ గొడవ వెనుక పెద్ద కారణమే ఉంది. గతంలో జరిగిన హోటల్ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండటంతో, తన వద్ద ఉన్న స్టార్స్, అమౌంట్‌ను తనకే ఇస్తాడని రోహిత్ ఆశించాడు. కానీ అమన్ వాటిని త్రిగుణ్‌కు ఇచ్చాడు. అప్పటి నుంచి అమన్‌పై లోలోపల కక్ష పెంచుకున్న రోహిత్.. ఇప్పుడు ఆ కోపాన్ని ఇలా బయట పెట్టాడు.

ఈ హోరాహోరీ టాస్క్‌లో చివరకు త్రిగుణ్ విజయం సాధించి కొత్త కెప్టెన్‌గా నిలిచాడు. అంతే కాకుండా, తాను హౌస్‌లో ఉన్నంత కాలం ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండే అరుదైన పవర్‌ను బిగ్‌బాస్ ద్వారా సొంతం చేసుకున్నాడు. త్రిగుణ్ కెప్టెన్ కావడంపై మిగతావారితో పాటు రోహిత్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు.

"నువ్వు మొదట ఎల్లో టీమ్‌లో ఉన్నావు కాబట్టే గ్రీన్ జోన్‌కు వెళ్లగలిగావు. ఒకవేళ నువ్వు కూడా రెడ్ టీమ్‌లో ఉంటే నీకు ఆ ఛాన్సే వచ్చేది కాదు.. నువ్వు కేవలం లక్‌తోనే కెప్టెన్ అయ్యావు" అంటూ రోహిత్ త్రిగుణ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శించాడు.

అయితే త్రిగుణ్ మాత్రం గెలుపు జోష్‌లో ఉన్నందున రోహిత్ మాటలను పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు. మొత్తానికి అమన్ - రోహిత్ స్నేహంలో చిచ్చుపెట్టిన ఈ కెప్టెన్సీ టాస్క్.. హౌస్‌లో కొత్త గ్రూప్ రాజకీయాలకు తెర లేపింది!