Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్ టాస్క్‌లో జబర్దస్త్ నరేష్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. టాస్క్‌లో ముఖేష్ బ్రిక్స్‌ను ఐదు సెకన్ల పాటు బ్యాలెన్స్ చేయాల్సి ఉండగా, నాలుగో సెకనులోనే అవి కిందపడ్డాయని హౌస్‌మేట్స్ అభ్యంతరం తెలిపారు. అయితే నరేష్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, తప్పు చేసినట్లు నాగార్జున తేల్చితే శిక్షను స్వీకరిస్తానని సవాల్ విసిరాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Nov 2026 1:50 PM IST
Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం అత్యంత కీలకమైన పదవ వారంలోకి అడుగు పెట్టింది. ఫ్యామిలీ వీక్ కోసం జరిగే టాస్కులు జరుగుతున్న ఈ తరుణంలో జరిగిన గొడవలు, వివాదాలు, కంటెస్టెంట్ల తీరుపై ఆడియన్స్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఇక వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వ్యవహారశైలి, ఆయన ఇచ్చే క్లాసులు కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతుంటాయి.

అయితే ఇప్పటివరకు హౌస్‌లో అందరికీ మొట్టికాయలు వేసిన నాగార్జున.. ఒక్క జబర్దస్త్ నరేష్‌ని మాత్రం ఏనాడూ విమర్శించకపోగా, ప్రతి వారం ఆకాశానికెత్తుతూ ప్రశంసిస్తూ వస్తున్నారు. అలాంటి నరేష్ తాజాగా ఫ్యామిలీ వీక్ టాస్క్‌లో చేసిన తప్పిదం, అతన్ని ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. ఫ్యామిలీ వీక్‌లో తమ కుటుంబ సభ్యులను కలుసుకునే మరో చివరి అవకాశంగా బిగ్‌బాస్ ముఖేష్, అమన్, వర్షిణి మరియు రామకృష్ణలకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఇచ్చారు.

ఈ గేమ్‌కు జబర్దస్త్ నరేష్‌ను సంచాలకుడిగా నియమించారు.

హౌస్-షేప్డ్ బ్రిక్స్‌ను ఒకదానిపై ఒకటి సరిగ్గా అమర్చాలి. ఆ తర్వాత నరేష్ 5 సెకండ్లు కౌంట్ చేయాలి. ఆ ఐదు సెకండ్లు ఆ బ్రిక్స్ పడిపోకుండా బ్యాలెన్స్ చేయగలిగితే, ఆ కంటెస్టెంట్ గెలిచినట్లు. ఈ టాస్క్‌లో ముఖేష్ బాగానే ఆడినప్పటికీ.. చివర్లో నరేష్ కౌంట్ చేసే సమయంలో ఆ బ్రిక్స్ కింద పడిపోయాయి. సరిగ్గా 'నాలుగో' నెంబర్ కౌంట్ చేస్తున్నప్పుడే అవన్నీ టపటపా కిందపడిపోవడం అక్కడున్న అందరికీ స్పష్టంగా కనిపించింది.

కానీ నరేష్ మాత్రం అడ్డంగా వాదిస్తూ, బుకాయించడం మొదలుపెట్టాడు. అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్ అందరూ నాలుగో నెంబర్ దగ్గరే పడిపోయాయని గట్టిగా వ్యతిరేకించినా నరేష్ తన పట్టు వీడలేదు. "నేను ఏమైనా తప్పు చేసి ఉంటే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున సర్ వచ్చి నన్ను తప్పు పడతారు, అప్పుడు నేను శిక్ష అనుభవిస్తా. ఒకవేళ నాదే తప్పు అని తేలితే నా ఫ్యామిలీని కలుసుకునే అవకాశాన్ని కూడా వదులుకుంటా.. ఇది నా ఛాలెంజ్" అంటూ అందరికీ సమాధానం ఇచ్చాడు.

ఇప్పటివరకు నాగార్జున నుంచి ఎప్పుడూ ప్రశంసలే తప్ప ఎటువంటి విమర్శలు ఎదుర్కొనని నరేష్, ఈసారి మాత్రం దొరికిపోయి అవకాశాలు ఉన్నాయని నెటిజెన్లు చెప్తున్నారు.