వీకెండ్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటీటీ మూవీలు/ సీరీస్ లు ఇవే!
మరి ఈ వీకెండ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ చిత్రాలు, సీరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 12 July 2026 12:40 PM ISTథియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే మనకు నచ్చిన జానర్లో ఫ్యామిలీతో కలసి సినిమా చూసే అవకాశం లభిస్తుంది. పైగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ..ట్రాఫిక్ గొడవ అసలుకే లేదు.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి నచ్చిన భోజనం వండుకొని నచ్చిన సినిమాను చూసే అవకాశాలను ఈ ఓటీటీలు కల్పిస్తున్నాయి. ఇక అసలే ఆదివారం.. మరి ఈ ఆదివారం మీకు నచ్చిన సినిమా లేదా సిరీస్ ను చూడడానికి ఓటీటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వీకెండ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ చిత్రాలు, సీరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సినిమా, సిరీస్ లతో దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీలో కొన్ని సన్నివేశాలను జత చేసి మరీ తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సింగ్ గీతం , పతీ పత్నీ ఔర్ ఓ దో, నథింగ్ టు లవ్, వండర్ఫుల్ నైట్ వంటి చిత్రాలతో పాటు.. గుర్తుకొస్తున్నాయి సీజన్ వన్, లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయారీ సీజన్ వన్, ఐ యాం నాట్ అఫ్రైడ్ సీజన్ వన్ తో పాటు థండర్ 3సీజన్ వన్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తున్న అమెజాన్..
ఇక మరొకవైపు ప్రైమ్ వీడియోలో పలు హారర్ థ్రిల్లర్ రొమాంటిక్ కామెడీ మిస్టరీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొత్త మలుపు సినిమా అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తుండగా.. మరొకవైపు త్రికాల స్క్రిప్ట్ ఆఫ్ గాడ్, డబుల్ ఆక్యుపెన్సీ, డోస్, శిఖండి, డగ్ డగ్, ది సీక్రెట్ ఏజెంట్ వంటి చిత్రాలతో పాటు క్వీన్స్ సీజన్ వన్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ మూవీలతో భయపెట్టేస్తున్న జియో హాట్ స్టార్..
జియో హాట్ స్టార్ విషయానికి వస్తే.. పంప్ కిన్ హెడ్ అనే హారర్ డ్రామా తెలుగు, తమిళ్, హిందీ , ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతోపాటు డీప్ రివేంజ్ , ల్యాండ్ ఆఫ్ ఫుట్బాల్, ది లెజెండ్ ఆఫ్ ఓచి వంటి చిత్రాలతో పాటు ది ఫైవ్ స్టార్ వీకెండ్ సీజన్ 1 సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఇక జీ 5 వేదికగా పరిమళ అండ్ కో, ఫ్రేమ్ వంటి చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈటీవీ విన్ యాప్ లో ఎకసెకలు సీజన్ వన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. సోనీ లీవ్ లో యాక్షన్ డ్రామా బల్టి కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అలాగే ఆపిల్ టీవీలో కామెడీ డ్రామా ట్రైయింగ్ సీజన్ 5 కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మొత్తానికి అయితే ఈ వీకెండ్ లో అందులోనూ ఆదివారం మీకు నచ్చిన సినిమాను లేదా నచ్చిన వెబ్ సిరీస్ ను ఈ ప్లాట్ఫార్మ్లలో చూసి ఎంజాయ్ చేయండి.
