Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలుగు, తమిళం, హిందీ వంటి భారతీయ భాషల్లో ‘అవతార్ 3’ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి హాట్‌స్టార్ ఒక ఆప్షన్.

By:  Madhu Reddy   |   25 March 2026 10:22 PM IST
ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్ అంటే తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుత ప్రపంచం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారి కోసం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. మరి ఈ క్రేజీ మూవీ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.

ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చు?:

ఇక గతేడాది డిసెంబర్ 19న విడుదలైన ‘అవతార్ 3’ దాదాపు మూడు నెలల తర్వాత డిజిటల్ తెరపైకి వస్తోంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్స్‌లో ‘రెంటల్’ ప్రాసెస్ లో మాత్రమే, అది కూడా కేవలం ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటుంది. అంటే సినిమా చూడాలంటే విడిగా కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక మన దగ్గర ఉన్న సబ్‌స్క్రైబర్లు దీని కోసం కాస్త వెయిట్ చేయక తప్పదు.

మన భాషల్లో ఎప్పుడు వస్తుంది?:

తెలుగు, తమిళం, హిందీ వంటి భారతీయ భాషల్లో ‘అవతార్ 3’ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి హాట్‌స్టార్ ఒక ఆప్షన్. మన దేశంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వద్ద ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ ఆఖరులో లేదా మే నెలలో ఈ సినిమా మన ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్లలో ఈ సినిమా తెలుగు వెర్షన్ సుమారు రూ.225 కోట్ల వసూళ్లు రాబట్టింది. కాబట్టి ఓటీటీలో కూడా మన జనాలు ఈ విజువల్స్ సిద్ధంగా వున్నారు.

అసలు ఈ మూడో భాగం కథేంటి?:

రెండో పార్ట్ ‘ద వే ఆఫ్ వాటర్’ ముగిసిన చోటు నుంచే ఈ కథ మొదలవుతుంది. జేక్ సల్లీ, నేతిరి జంట తమ పెద్ద కొడుకును కోల్పోయిన బాధలో ఉంటారు. ఈసారి వారికి శత్రువులు మరింత ఎక్కువయ్యారు. పాత విలన్ కల్నల్ క్వారిచ్ మళ్ళీ పుట్టి ప్రతీకారానికి వస్తాడు. అతనికి అగ్ని తెగకు చెందిన ‘వరంగ్’ అనే కొత్త నాయకురాలు తోడవుతుంది. నీటి తెగ నుంచి అగ్ని తెగ వరకు సాగే ఈ పోరాటంలో జేక్ తన కుటుంబాన్ని, పాండోరా ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.

గ్రాఫిక్స్ అదిరాయి.. స్టోరీ ఎలా ఉంది?:

జేమ్స్ కామెరూన్ సినిమాలంటేనే గ్రాఫిక్స్ మాయాజాలం. ఈ సినిమాలో కూడా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చూసిన వాళ్లు చెబుతున్నారు. కథలో కొత్తదనం లేదని కొందరు విమర్శించినా, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ సినిమా ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో గ్రాఫిక్స్ ఎంజాయ్ చేయలేకపోయిన వారు, ఇప్పుడు ఇంట్లోనే హోమ్ థియేటర్లో ఈ పాండోరా ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అగ్ని తెగ పోరాటాలు ఎలా ఉన్నాయో చూడాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే!