Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: పాపం షాలిని.. ఇకపై ఆట కష్టమే!

బిగ్‌బాస్ హౌస్‌లో అగ్నుపరీక్ష కంటెస్టెంట్ అపూర్వ ప్రయాణం ముగిసింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Oct 2026 8:59 AM IST
Bigg Boss Telugu 10: పాపం షాలిని.. ఇకపై ఆట కష్టమే!
X

బిగ్‌బాస్ హౌస్‌లో అగ్నుపరీక్ష కంటెస్టెంట్ అపూర్వ ప్రయాణం ముగిసింది. ఐదో వారం ముగిసే సరికి ప్రేక్షకులు ఆమెను ఓట్ల ద్వారా హౌస్ నుంచి బయటకు పంపించారు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టమనేది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. బయట నుంచి మొత్తం ఆటను పూర్తిగా అధ్యయనం చేసి వచ్చినప్పటికీ, చాలామంది తమ సొంత గేమ్‌ప్లే ఏంటో నిరూపించుకోవడంలో విఫలమవుతుంటారు. అపూర్వ విషయంలోనూ అదే జరిగింది.

స్టేజ్ మీదకు చేరుకున్న అపూర్వ తన జర్నీ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌కు చేదు నిజాలతో కూడిన "బిటర్ షాట్స్" ఇవ్వాల్సిందిగా నాగ్ కోరారు.

అపూర్వ మొదటి బిటర్ షాట్‌ను రోహిత్‌కు ఇస్తూ మంచి సలహాని ఇచ్చింది. "నువ్వు ఇతరులను చిన్న చూపు చూస్తావు. నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకుంటావు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ హద్దు దాటొద్దు. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో." అని చెప్పింది.

అయితే అపూర్వ మాట్లాడు తున్నప్పుడు మాత్రం, రోహిత్ చాలా కేర్లెస్ గా కనిపించాడు. ఇదే నేపథ్యంలో షాలిని వైపు తిరుగుతూ, "నువ్వు పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావు. అగ్నిపరీక్ష సమయంలో నువ్వు ఎలా ఉన్నావో, ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉన్నావు. ఎవరి నీడలోనో దాక్కున్నావు. నీకోసం నువ్వు ఆడు, అసలు గేమ్‌లోకి రా. నువ్వు ఎక్కడికో దారి తప్పుకున్నావు. రియాక్ట్ అయ్యే ముందు అవతలి వాళ్ళు చెప్పేది విను. నా సలహా నచ్చితే తీసుకో, లేదంటే వదిలేయి." అని చెప్పింది.

షాలిని లేచి నిలబడి, "నువ్వు చాలా స్ట్రాంగ్, ఒక నిజమైన ఫైటర్. మేము నిన్ను మిస్ అవుతాము" అంది. వెంటనే నాగ్ మధ్యలో జోక్యం చేసుకుంటూ, "మేమా? ఆ 'మేము' లో సరిగ్గా ఎవరెవరు ఉన్నారు?" అని ప్రశ్నించగా, షాలిని "మేమందరం, సర్" అని బదులిచ్చింది. అప్పుడు అపూర్వ నవ్వుతూ, "రోహిత్, షాలిని... మీ ఇద్దరి మధ్యలోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు; మీ ఇద్దరూ ఒకరికొకరు జోడీగా పుట్టారు" అని వ్యాఖ్యానించింది.

దీంతో ఒక విషయం మీద క్లారిటీ ఇచ్చింది. ఇకపై షాలిని ఏం చేసినా రోహిత్ తో కచ్చితంగా ముడి పెడతారు. సో, ఆమె ఆట మార్చుకోకపోతే ఇక సర్వైవ్ అవ్వడం కష్టమే.