Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: అపూర్వను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారంలోకి అడుగుపెట్టగా, సోమవారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వాగ్వాదాలు, మాటల యుద్ధాలతో హోరెత్తింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   6 Oct 2026 9:25 AM IST
Bigg Boss Telugu 10: అపూర్వను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారంలోకి అడుగుపెట్టగా, సోమవారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వాగ్వాదాలు, మాటల యుద్ధాలతో హోరెత్తింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమ ఎదురుగా ఉన్న కుండను పగులగొడుతూ తమ కోపాన్ని ప్రదర్శించారు. కెప్టెన్ వర్షిణి, సుధీర్ మరియు వంశీలకు ఇమ్యూనిటీ లభించడంతో వారిని మినహాయించి ఎవరినైనా నామినేట్ చేయచ్చని బిగ్‌బాస్ ఆదేశించారు.

ముఖేష్ మరియు త్రిగుణ్ ఇద్దరూ అపూర్వను టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. అపూర్వ కెప్టెన్సీ తీరును తప్పుబడుతూ ముఖేష్ వాదించగా, అపూర్వ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అయితే త్రిగుణ్‌తో జరిగిన వాదనలో మాత్రం అపూర్వ కాస్త వెనకబడింది. త్రిగుణ్ ఆమెను 'డిజాస్ట్రస్ కెప్టెన్' అంటూ ఎద్దేవా చేశాడు. అపూర్వ డిఫెండ్ చేసుకొనే ప్రయత్నం లో ఎక్కువగా వాదనకి దిగడంతో అది కాస్త మైనస్ పాయింట్గా మారింది.

వర్షిణి కూడా అపూర్వను నామినేట్ చేస్తూ.. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి పోస్ట్‌కార్డ్ లాగా మారిపోయావంటూ సెటైర్లు వేసింది. అపూర్వ కి చెప్పిన విషయాలను వెంటనే తీసుకెళ్లి రోహిత్‌కు చేరవేస్తోందని ఆరోపించింది. అయితే ఈ సందర్భంలో వర్షిణి కెప్టెన్ అయినప్పటికీ, బ్యాడ్జ్ ఆమెది, కానీ పెత్తనం మొత్తం ముకేశ్ ది అని కామెంట్ చేసింది అపూర్వ. ఈ విషయాన్ని వర్షిణి అంగీకరించకుండా అపూర్వతో ఇంకాస్త పెద్ద గొడవకి దిగింది.

నిజానికి అపూర్వ కెప్టెన్గా ఫెయిల్ అయిన నేపథ్యంలో, నాగార్జున కూడా ఆమెని క్రిటిసైజ్ చేసిన కారణంగా, హౌజ్ మేట్స్ అందరూ అదే పాయింట్ పట్టుకొని ఆమెని పదే పదే ఇబ్బంది పెట్టారు. సో, అపూర్వకి కెప్టెన్సీ విషయంలో డిఫెండ్ చేసుకొనేందుకు పెద్దగా అవకాశం దొరకలేదు.

ఇలా ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ రసాభాసగా సాగగా, ఈ వారం ఎవరు ఎలిమినేషన్ బరిలో నిలిచారనే పూర్తి వివరాలు రానున్న ఎపిసోడ్లలో తేలనున్నాయి. ఈ వారం నామినేషన్స్ రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకాస్త డ్రామా కి రంగం సిద్దమైందనుకోవచ్చు.