ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా'.. కనీసం ఇక్కడైనా మెప్పిస్తుందా?
అనుపమ పరమేశ్వరన్.. మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ' సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
By: Madhu Reddy | 12 Sept 2025 2:58 PM ISTఅనుపమ పరమేశ్వరన్.. మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ' సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈమె.. ఆ తర్వాత 'శతమానం భవతి' సినిమాతో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. అదే సమయంలో.. 'రంగస్థలం' లో హీరోయిన్గా అవకాశం ఇచ్చినా కాదనుకుంది అనే రూమర్లను ఎదుర్కొన్న ఈమె.. వీటి కారణంగా ఆరు నెలల పాటు అవకాశాలు కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక అవన్నీ రూమర్స్ అని తనను ఎవరు సంప్రదించలేదని.. ఇటీవల తాను నటించిన పరదా సినిమా ప్రమోషన్స్ లో అసలు నిజం చెప్పింది.
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరదా..
ఇకపోతే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ప్రస్తుతం 'కిష్కింధపురి' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు అనుపమ నటించిన మరో చిత్రం 'పరదా'. లేడీ ఓరియంటెడ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా వచ్చిన పరదా తన కెరియర్ లోనే బెస్ట్ మూవీ అని అనుపమ తెలిపింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన మూడు వారాలలోపే ఓటీటీలోకి రావడం గమనార్హం. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, మలయాళం వెర్షన్లలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా కనీసం ఓటీటీ లోనైనా మెప్పిస్తుందేమో చూడాలి.
అనుపమ పరదా మూవీ స్టోరీ..
పరదా సినిమా స్టోరీ విషయానికి వస్తే.." పడతి అనే ఒక ఊరిలో మహిళలంతా కూడా పరదాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషుడి ముఖాలు కూడా చూడకూడదు అనేది ఆ ఊరి కట్టుబాటు. చూస్తే ఊరికి అరిష్టం దాపరించి , పిల్లలు పుట్టరని.. పుట్టిన పురిటిలోనే చనిపోతారని.. ఆ ఊరి ప్రజలు బలంగా నమ్మేవారు. దానికి జ్వాలమ్మ అనే ఒక కథ కూడా ఉంటుంది. అయితే అదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ).. అదే ఊళ్లో ఉండే రాజేష్ (రాగ్ మయూర్)ను ఇష్టపడుతుంది. నిశ్చితార్థం సమయానికి ఒక ఊహించని ఘటన జరగడంతో గొడవ జరిగి ఆ శుభకార్యం కాస్త ఆగిపోతుంది. సుబ్బు ఆత్మహుతి చేసుకోవాలని ఊరంతా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుబ్బు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది?" అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
