Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లో ఆటగాళ్లు పురుషాంగం సైజు పెంచుకుంటున్నారా..!

అయితే.. ఇప్పటివరకూ ఇది జరుగుతుంది అనడానికి ఎలాంటి గట్టి రుజువు లేదని.. కానీ, అత్లెట్లు ఈ విధంగా తమ ప్రదర్శనలను మెరుగుపరుచుకున్నట్లయితే కచ్చితంగా దర్యాప్తు చేస్తామని వాడా తెలిపింది.

By:  Raja Ch   |   6 Feb 2026 11:54 PM IST
ఒలింపిక్స్  లో ఆటగాళ్లు పురుషాంగం సైజు పెంచుకుంటున్నారా..!
X

సాధారణంగా ఒలింపిక్స్ తో పాటు చాలా అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో డోపింగ్ ఆరోపణలు వినిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తాజా వింటర్ ఒలింపిక్స్ లో ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా పోటీల్లో పాల్గొనడానికి అథ్లెట్లు తమ పురుషాంగం సైజు పెంచుకోవడానికి హైలురోనిక్ యాసిడ్ ను ఇంజెక్ట్ చేసుకుంటూ ప్రయత్నిస్తున్నారని చెబుతూ... ఈ తాజా కుంభకోణాన్ని "పెనిస్గేట్" అని పిలుస్తున్నారు.

అవును... సూట్ల సైజు పెంచడం వల్ల జంప్ లెంగ్త్ లు ఎక్కువగా ఉంటాయని.. అందువల్ల ఇప్పుడు అథ్లెట్లు తమ పురుషాంగం సైజు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగా ఆ భాగానికి హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా.. పెద్ద సూట్ లలో పోటీ పడగలిగేలా కృత్రిమంగా వారి కొలతలను పెంచుతున్నారని నివేదికలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఇవి సంచలనంగా మారాయి.

ఇలా... ఒలింపిక్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కీ జంపర్లు పురుషాంగం సైజు పెంచుకోవడానికి హైలురోనిక్ యాసిడ్ ను ఇంజెక్ట్ చేసుకునే అవకాశం ఉందనే విషయంపై తాజాగా స్పందించిన పోలాండ్ కు చెందిన వరల్డ్ యాంటి డోపింగ్ ఏజెన్సీ (వాడా) అధ్యక్షుడు విటోల్డ్ బంకా... పోలాండ్ లో స్కీ జంపింగ్ చాలా ప్రజాదరణ పొందింది కాబట్టి.. తాజా కుంభకోణం విషయాన్ని తాను చూస్తానని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

అయితే.. ఇప్పటివరకూ ఇది జరుగుతుంది అనడానికి ఎలాంటి గట్టి రుజువు లేదని.. కానీ, అత్లెట్లు ఈ విధంగా తమ ప్రదర్శనలను మెరుగుపరుచుకున్నట్లయితే కచ్చితంగా దర్యాప్తు చేస్తామని వాడా తెలిపింది. ఈ మేరకు వాడా డైరెక్టర్ జనరల్ ఆలీవర్ నిగ్లీ స్పందిస్తూ... స్కీ జంపింగ్ వివరాలు తనకు తెలియదని.. కానీ, ఏదైనా బయటపడితే మాత్రం అది నిజంగా డోపింగ్ కు సంబంధించినదేనా అనేది తాము పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.