Begin typing your search above and press return to search.

భారత్‌లో మెస్సీ పూర్తి మ్యాచ్ ఎందుకు ఆడలేదు? కారణమిదీ

లియోనెల్ మెస్సీ.. ఈ పేరు వినగానే చాలు ఫుట్ బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది.

By:  A.N.Kumar   |   16 Dec 2025 10:52 AM IST
భారత్‌లో మెస్సీ పూర్తి మ్యాచ్ ఎందుకు ఆడలేదు? కారణమిదీ
X

ఈ పెద్దోళ్లు అంతేరా బై.. తమకు సంపాదన తీసుకొచ్చే అన్నింటిని మీద ఇన్సూరెన్సూ చేయిస్తారు. ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కూడా అంతే.. ఫుట్ బాల్ ఆడడానికి కాళ్లు ప్రధానం.. అందుకే తన ఎడమ కాలిపై ఏకంగా 8వేల కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించాడట.. అది ఎందుకు చేయించాడు? ఏంటా కథ అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

లియోనెల్ మెస్సీ.. ఈ పేరు వినగానే చాలు ఫుట్ బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. అతడి మాంత్రిక ఎడమపాదం.. మైదానంలో చేసే అద్భుతాలు ప్రత్యక్షంగా చూడాలన్నది ప్రతి అభిమాని కల. అయితే మెస్సీ భారత్ పర్యటనలో పూర్తి స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడలేదన్న ప్రశ్న అభిమానులను నిరాశకు గురిచేసింది. దీనికి కారణం ఫిట్ నెస్ కాదు.. ఫామ్ కాదు.. ఇన్సూరెన్స్ పరిమితులే అసలు కారణం.

ఇన్సూరెన్స్ కారణంగా తీసుకున్న కీలక నిర్ణయం

లియోనెల్ మెస్సీ కేవలం ఒక ఆటగాడు మాత్రమేకాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది డాలర్ల విలువైన బ్రాండ్. ముఖ్యంగా అతడి లెజెండరీ ఎడమపాదం మాత్రమే సుమారు రూ.8000 కోట్లు (900 మిలియన్ డాలర్లు) విలువైన ఇన్సూరెన్స్ లో ఉంది. అయితే ఆ ఇన్సురెన్స్ పాలసీలో ఒక కీలక నిబంధన ఉంది.

ఎగ్జిబిషన్ మ్యాచ్ లు, ఫ్రెండ్లీ గేమ్స్ కు ఈ ఇన్సూరెన్స్ వర్తించదు

భారత్ లో మెస్సీ పాల్గొనబోయే ఈవెంట్లు అధికారిక లీగ్ లేదా అంతర్జాతీయ టోర్నమెంట్ మ్యాచ్ లు కావు. అవి ఎగ్జిబిషన్ ఈవెంట్లుగా పరిగణించబడుతాయి. అలాంటి మ్యాచ్ లో మెస్సీకి ఏదైనా గాయం అయితే ఆ నష్టం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ కాకపోవడం పెద్ద ఆర్థిక ప్రమాదంగా మారుతుంది.

ఎగ్జిబిషన్ మ్యాచులు ఎందుకు ప్రమాదకరం

మెస్సీ లాంటి ప్రపంచస్థాయి ఆటగాడికి ఎగ్జిబిషన్ మ్యాచ్ లు రిస్క్ తో కూడుకున్నవి. దీనికి ప్రధాన కారణాలున్నాయి. ఎగ్జిబిషన్ మ్యాచ్ లు జరిగే చోట పిచ్ పరిస్థితులు పూర్తిగా ప్రొఫెషనరల్ ప్రమాణాల్లో ఉండకపోవచ్చు. అధికారిక టోర్నమెంట్ల స్థాయిలో ఆట తీవ్రత, భద్రతా ఏర్పాట్లు భిన్నంగా ఉంటాయి. చిన్న గాయం వచ్చినా అది క్లబ్, స్పాన్సర్లు, అంతర్జాతీయ ఈవెంట్లపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ రిస్క్ లను దృష్టిలో ఉంచుకొని మెస్సీ మేనేజ్ మెంట్ టీమ్, క్లబ్ లు, ఇన్సూరెన్స్ సంస్థలు రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేవు.

అభిమానులకు నిరాశ

మెస్సీని పూర్తి 90 నిమిషాలు ఆడితే చూడాలని భారత అభిమానులు కోరుకున్నారు. కానీ వాస్తవంగా అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ మెస్సీ భారత పర్యటన చారిత్రక ఘట్టమే. అభిమానులకు మెస్సీని చూడడం ఒక ఎవర్ గ్రీన్ అనుభవం. అతడి అద్భుతమైన స్కిల్ డెమో లేదా స్పెషల్ కిక్ ను ఎంజాయ్ చేశారు. అభిమానులతో ఇంటరాక్షన్, ఫొటో సెషన్స్ వంటివి అలరించాయి.

లియోనెల్ మెస్సీ భారత్ లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోవడం అతడి ఇష్టం లేక కాదు.. భారీ ఇన్సూరెన్స్ పరిమితుల వల్ల ఏర్పడిన తప్పనిసరి పరిస్థితి. 8వేల కోట్ల విలువైన ఎడమ పాదానికి రిస్క్ తీసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆటగాడి భద్రత,కెరీర్, అంతర్జాతీయ ఒప్పందాలు ఇవన్నీ భావోద్వేగాల కంటే ముఖ్యమైనవిగా మారుతాయి.

అయినా ఫ్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ భారత్ గడ్డపై అడుగుపెట్టడమే ఫుట్ బాల్ అభిమానులకు ఒక చారిత్రక, మర్చిపోలేని ఘట్టంగా నిలుస్తుంది.