Begin typing your search above and press return to search.

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

భారత క్రికెట్ చరిత్రలో `వెరీ వెరీ స్పెషల్` ఇన్నింగ్స్‌లతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ జీవితం సిల్వర్ స్క్రీన్‌పైకి రానుందనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 7:07 PM IST
తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!
X

భారత క్రికెట్ చరిత్రలో `వెరీ వెరీ స్పెషల్` ఇన్నింగ్స్‌లతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ జీవితం సిల్వర్ స్క్రీన్‌పైకి రానుందనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడాకారుల బయోపిక్‌లు ఇప్పటివరకు పెద్దగా రాకపోవడంతో.. ఆ లోటును తీర్చేందుకు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ల‌క్ష్మ‌ణ్ జీవితంపై దృష్టి సారించినట్లు సమాచారం. హైద‌రాబాద్ కు చెందిన స్టైలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రయాణాన్ని సినిమాగా మలిచే సన్నాహాలు జరుగు తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అద్భుతమైన షాట్లు, ఒత్తిడిలోనూ నిలకడగా ఆడే తత్వం, కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలి యాపై ఆయన ఆడిన చారిత్రాత్మక 281 పరుగుల ఇన్నింగ్స్ వంటి అంశాలు సినిమాకు సరిగ్గా సరిపోతాయని స‌దరు నిర్మాణ సంస్థ రైటింగ్ టీమ్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతోందిట‌. తెలుగు క్రీడాకారుల విషయానికి వస్తే అశ్విని నాచప్ప మినహా నేరుగా మన అథ్లెట్ల జీవితాలపై టాలీవుడ్‌లో బలమైన బయోపిక్‌లు రాలేదనే వాదన ఎప్పటి నుంచో ఉంది.

మిథాలీ రాజ్, పీవి సింధు వంటి గ్లోబల్ స్టార్స్ ఉన్నా? వారి బయోపిక్‌లకు అంత క్రేజ్ ఉండ‌దు. ఈ లోటును పూడ్చడానికి లక్ష్మణ్ బయోపిక్ సరైన ఎంపిక అవుతుందని స‌ద‌రు సంస్థ ర‌చ‌యిత‌లు భావిస్తున్నారుట‌. క్రికెట్ మ్యాచులు మాత్రమే కాకుండా లక్ష్మణ్ సాధార‌ణ‌ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన వైనం, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లు.. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ప్రదర్శించిన పోరాట పటిమ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఒక క్రీడాకారుడి మానసిక స్థైర్యాన్ని, కుటుంబ నేపథ్యాన్ని ఈ చిత్రంలో భావో ద్వేగభరితంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఇదంతా ప్రాధ‌మికంగా జ‌రుగుతోన‌ర్న చ‌ర్చ మాత్ర‌మే. ఈ ప్ర‌పోజ‌ల్ వ‌ర్కౌట్ అవ్వాలంటే ల‌క్ష్మ‌ణ్ అనుమ‌తి ఉండాలి. ఆయ‌న ఒకే చెబితేనే ముందుకెళ్ల‌డానికి అవ‌కాశం ఉంటుంది. స‌ద‌రు నిర్మాణ సంస్థ సూచ‌న మేర‌కు రైట‌ర్ల బృందం రెడీ అవుతుంద‌ని..త్వర‌లోనే ల‌క్ష్మ‌ణ్ ని క‌లిసే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఇప్ప‌టికే బ్యాడ్మింట‌ర్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌ని సుధీర్ బాబు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో తెసిసిందే. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఈ ప్రాజెక్ట్ ను త‌ల‌పెట్టారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తి కాని సంగ‌తి తెలిసిందే.