Begin typing your search above and press return to search.

అరిస్తే మద్దతు, దూకితే నేరం... మైదానంలో ఏమిటీ 'ట్రెస్ పాసింగ్'?

వాస్తవానికి ఇలా అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ రావడం, తమ అభిమాన క్రీడాకారుడి కాళ్లకు నమస్కారం చేయడం జరుగుతూనే ఉంటుంది.

By:  Raja Ch   |   1 Dec 2025 12:22 PM IST
అరిస్తే మద్దతు, దూకితే  నేరం... మైదానంలో ఏమిటీ ట్రెస్  పాసింగ్?
X

ఆదివారం రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లీ రికార్డు స్థాయిలో చెంచరీతో అదరగొట్టాడు. 102 బంతుల్లోనే సెంచరీ చేసిన కొహ్లీ.. తన కెరీర్ లో 52వ శతకం నమోదు చేశాడు. మొత్తంగా ఆ ఇన్నింగ్స్ లో 120 బంతులు ఆడిన కొహ్లీ.. 11 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో 135 పరుగులు చేశాడు. అయితే.. కొహ్లీ సెంచరీ చేయగానే ఓ అభిమాని మైదానంలోకి వచ్చి, అతని కాళ్లకు నమస్కారం చేశాడు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అవును... రాంచీలో విరాట్ కొహ్లీ 52వ వన్డే సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో.. గాలిలో ఒక పంచ్, ఒక జంప్, తనదైన శైలిలో ఒక చిరునవ్వు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతని వద్దకు పరుగెత్తుకొచ్చి, కాళ్లకు నమస్కారం చేశాడు. కొహ్లీ వెంటనే వంగి, అభిమానిని పైకి లేపడానికి సహాయం చేసి, పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు భద్రతా సిబ్బంది, భద్రతా సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చి, అతన్ని అక్కడ నంచి బయటకు తీసుకెళ్లారు.

వాస్తవానికి ఇలా అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ రావడం, తమ అభిమాన క్రీడాకారుడి కాళ్లకు నమస్కారం చేయడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో అటు క్రికెట్ లో ఎంతో మంది స్టార్స్ కి ఈ అనుభవాలు ఎదురవ్వగా.. ఫుట్ బాల్ మ్యాచ్ లలోనూ కనిపిస్తుంటాయి! అయితే... ఈ ఘటన తర్వాత సదరు అభిమాని పరిస్థితి ఏమిటి? అతన్ని అధికారులు అరెస్ట్ చేస్తారా? అంటే.. పలు దేశాల్లో అవుననే అంటున్నారు!

ట్రెస్ పాసింగ్!:

ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్ లను నడుపుతుంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మైదానం చుట్టూ పెద్ద ఎత్తున ఇనుప కంచె ఏర్పాటు చేస్తారు. భద్రతా సిబ్బంది నిలబడి అన్నీ పర్యవేక్షిస్తుంటారు. ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది మైదానంలోకి ప్రవేశిస్తుంటారు. ఇలా అనుమతి లేకుండా మైదానంలోకి ప్రవేశించడాన్నే ట్రెస్ పాసింగ్ అంటారు.

ఈ పనికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసే అధికారం మన దేశంలో ఉంది. అయితే... పోనీలే వదిలేయండి అనే మాటలు గతంలో ఆటగాళ్ల నుంచి వినిపించడంతో.. అప్పట్లో వార్నింగ్ ఇచ్చి పోలీసులు వదిలేసేవారు! అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు! ఇందులో భాగంగా.. అతడికి భారీ జరిమానా విధించడం వంటివాటితో పాటు జీవితకాలం స్టేడియం నుంచి నిషేధం విధించే ఛాన్స్ అవకాశమూ ఉందని అంటున్నారు.

విదేశాల్లో భారీ జరిమానాలు, ఇబ్బందులు!:

ఇలా ట్రెస్ పాసింగ్ కి పాల్పడేవారి విషయంలో పలు దేశాల్లో లక్షల్లో జరిమానా విధించబడుతుంది. దీంతో పాటు జైలు శిక్షా అనుభవించాల్సి ఉంటుంది. ఈ ప్రభావం కంచె దూకుని అభిమానికి మాత్రమే కాదు సుమా.. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఇది సమస్యగా మారుతుంది. ఇందులో భాగంగా... అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగం పోవడమే కాదు.. సదరు సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టు సైతం రద్దయ్యే అవకాశం ఉంది!

గతంలో షాకింగ్ ఘటన!:

ఇక్కడ అభిమానులను హర్ట్ చేయాలనే కోణంలో ఈ విషయాన్ని చూడకుండా.. ఆటగాడి భద్రతా పరంగా చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం అనే చెప్పాలి. ఉదాహరణకు.. గతంలో టెన్నీస్ ప్లేయర్ మోనికా సెలెస్ ను ఒక అభిమాని మైదానంలోనే కత్తితో పొడిచాడు. అందుకే... ఆటగాడి వద్దకు వచ్చిన వ్యక్తి అభిమానా.. లేక, హాని చేయడానికి వచ్చాడా అనే సందిగ్ధంలో.. వాళ్లు ఒక్కసారిగా భయపడతారు! అందుకే... ఇలాంటి పనులు అభిమాని భవిష్యత్తుకే కాదు, ఆటగాడి సెఫ్టీకి కూడా ఇబ్బందులు కలిస్తాయనే.. వీటిపై అధికారులు స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు!