ఇంగ్లాండ్ సిరీస్‌లో అంగ్రీ చీతాకు చోటు కన్ఫామా.?
బేబీ బాస్. యంగ్ వైల్డ్ ఫైర్..ఫియర్ లెస్ హిట్టింగ్ కు కేరాఫ్ వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల ఈ యువ సంచలనం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ మెన్ గా దుమ్ముదులిపేస్తున్నాడు.
By: Tupaki Political Desk | 30 Jun 2026 10:42 AM ISTబేబీ బాస్. యంగ్ వైల్డ్ ఫైర్..ఫియర్ లెస్ హిట్టింగ్ కు కేరాఫ్ వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల ఈ యువ సంచలనం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ మెన్ గా దుమ్ముదులిపేస్తున్నాడు. అలాంటి వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఓపెనర్ గా రంగంలోకి పవర్ ప్లేలోనే దుమ్ము దులిపేసే బ్యాటింగ్ తో అందరి మనసు గెలుచుకున్న వైభవ్. ఐర్లాండ్ సిరీస్ కు ఎంపికైనా..బెంచ్ కే పరిమితం అయ్యాడు. టీమ్ లో సీనియర్లు ఉండటంతో ప్లేయింగ్ లెవెన్ లో వైభవ్ కు చోటు దక్కలేదు. అయితే ఐర్లాండ్ సిరీస్ లో భారత్ ఓడిపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైభవ్ సూర్యవంశీని ఆడించి ఉంటే..పసికూనపై పరువు తీసుకునే పరిస్థితి రాకపోయేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్లేస్ పక్కానా.?
జూలై ఫస్ట్ నుంచి ఇంగ్లాండ్ తో టీ20 సీరిస్ స్టార్ట్ అవుతుంది. టీమ్ స్క్వాడ్ లో వైభవ్ సూర్యవంశీ పేరు ఉంది. కానీ టాప్ ఆర్డర్ లో వైభవ్ ను దించుతారో లేక బెంచ్ కే పరిమితం చేస్తారోననేది ఉత్కంఠ రేపుతోంది. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలపై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. వైభవ్ డిఫెన్సివ్ బ్యాటరే కాదు, సిచ్యువేషన్ బట్టి బౌలర్లపై అటాకింగ్ కు దిగగలిగే ప్లేయర్. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఇటువంటి అగ్రెసివ్ మైండ్‌సెట్ ఉన్న ఓపెనర్ జట్టుకు ఎంతో అవసరం. రాబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలను దృష్టిలో పెట్టుకొని, సెలక్టర్లు వైభవ్‌ను ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై పరీక్షించాలనుకుంటే అవకాశం ఇవ్వొచ్చు.
ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిన కొందరు ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలంటూ టీమిండియా మేనేజ్‌మెంట్ పై ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ పెరుగుతోంది.
వైభవ్ కోసం ఎవరిని సైడ్ చేస్తారు.?
టీమిండియాలో ఇప్పటికే స్థిరపడిన ప్లేయర్లు, యువ క్రికెటర్లకు ఇస్తున్న ప్రాధాన్యతపైనే అందరి చూపు నెలకొంది. బుధవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ స్టార్ట్ కానుండటం ఒక ఎత్తు అయితే..అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. అతడు ఆడాలంటే..టాప్ ఆర్డర్ లో ఉన్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లో ఒకరిని పక్కన పెట్టాల్సి రావొచ్చు. కానీ ఐర్లాండ్ సిరీస్ ను బట్టి చూస్తే సీనియర్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదే జరిగితే వైభవ్ కు వెయి టింగ్ తప్పేలా లేదు. ఒకవేళ టాప్-3లో ఉన్న ఎవరైనా ఇంజురీ బారిన పడితే..లేకపోతే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా మూడు భారత్ గెలిస్తే..చివరి రెండు మ్యాచ్ లలో వైభవ్ కు ఆడే అవకాశం దక్కొచ్చు. అయితే వైభవ్ సూర్యవంశీలో ఉన్న ప్రతిభపై సెలెక్టర్లకు డౌట్స్ అక్కర్లేదు. ఐర్లాండ్ సిరీస్‌లో నిరాశ ఎదురైనా.. ఇంగ్లాండ్ సిరీస్ అతడి కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ కానుంది. లైనప్‌లో చోటు దక్కితే, ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని వైభవ్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పడం ఖాయమన్న హోప్స్ వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఎంట్రీ కన్ఫామ్్ అయితే ఈ యువ సంచలనం ఇంగ్లాండ్ గడ్డపై ఎలా రాణిస్తాడో చూడాలి.!
