ఆసీస్ క్రికెట్ లో ఇంత జాతి వివక్షా? పాక్ సంతతి ప్లేయర్ సంచలనం
నల్ల జాతి క్రికెటర్ అని చెప్పుకొంటూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికాడు ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా. 39 ఏళ్ల ఖవాజా ఈనెల 4 నుంచి సిడ్నీలో జరిగే యాషెస్ ఐదో టెస్టు తీనకు ఆఖరిదని ప్రకటించాడు.
By: Tupaki Political Desk | 2 Jan 2026 12:18 PM ISTఇంతకాలం జాతి వివక్ష దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ లోనే వినిపించేంది. ఇప్పుడది ఆస్ట్రేలియా క్రికెటో లోనూ వేళ్లూనుకుని ఉందని స్పష్టమైంది. అది కూడా ఆసీస్ తరఫున 15 ఏళ్ల పాటు ఆడిన క్రికెటర్ నుంచి బయటపడింది. అతడు పైలట్ కావాలనుకుని క్రికెట్ లోకి వచ్చాడు... పాకిస్థాన్ సంతతికి చెందినా ఆస్ట్రేలియాకు ఆడే స్థాయికి ఎదిగాడు.. స్థిరమైన ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు.. కమ్ బ్యాక్ హీరోగానూ పేరుతెచ్చుకున్నాడు. మరో ఏడాదిపాటు అయినా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు అనుకుంటే.. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతేకాదు.. పోతూపోతూ వామ్మో ఆసీస్ క్రికెట్ లో ఇంతటి తీవ్ర జాతి వివక్ష ఉందా? అనిపించేలా ఆరోపణలు చేశాడు. బహుశా 80కి పైగా టెస్టులు ఆడిన అతడి నుంచి ఈస్థాయి ప్రవర్తనను ఆసీస్ మీడియానే కాదు ఆ దేశ బోర్డు కూడా ఊహించి ఉండదేమో..? మున్ముందు ఇతర దేశ క్రికెటర్లను తమ జాతీయ జట్టుకు ఎంపిక చేయాలంటేనే ఆలోచించేంతటి తీవ్రంగా ఆరోపణలు చేశాడు ఈ క్రికెటర్.
నల్లజాతి వాడినంటూ
నల్ల జాతి క్రికెటర్ అని చెప్పుకొంటూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికాడు ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా. 39 ఏళ్ల ఖవాజా ఈనెల 4 నుంచి సిడ్నీలో జరిగే యాషెస్ ఐదో టెస్టు తీనకు ఆఖరిదని ప్రకటించాడు. కాగా, తాను ఆస్ట్రేలియా క్రికెట్ లో తీవ్ర జాతి వివక్షను చవిచూసినట్లు బాంబు పేల్చాడు. తాను భిన్నంగా ఉన్నానని, నల్ల జాతి క్రికెటర్ ను కావడంతో ఆస్ట్రేలియా తరఫున ఆడలేనని భావించారని, కానీ, తాను దానిని సాధ్యం చేసి చూపానని తెలిపాడు.
సహచరులే కాదు మీడియా కూడా వివక్ష చూపింది
తనపై జట్టులోని సహచర క్రికెటర్లే కాదు.. మీడియా కూడా వివక్ష చూపిందని ఖవాజా ఆరోపించాడు. ఆట పట్ల తన నిబద్ధతను శంకించారని.. తన ప్రిపరేషన్ ను అనుమానించారని పేర్కొన్నాడు. ఇతర ఆటగాళ్లు గాయపడితే జాలి చూపేవారని.. అదే తన విషయంలో మాత్రం తననే తప్పుబట్టేవారని ఆరోపించాడు. మిగతా క్రికెటర్లు తాగి గాయపడినా ఏమీ అనేవారు కాదని, తనను మాత్రం నువ్వే కారణం అన్నట్లు నిందించేవారని ఖవాజా తెలిపాడు. కాగా, ఖవాజాది పాకిస్థాన్. ఆస్ట్రేలియాకు ఆడిన తొలి ముస్లింగా రికార్డు సాధించాడు. 2011లో అరంగేట్రం చేశాడు. 87 టెస్టుల్లో 6,206 పరుగులు సాధించాడు. 40 వన్డేల్లో 1,554 పరుగులు చేశాడు. 9 టి20ల్లో 241 పరుగులు చేశాడు
