హమ్మయ్యా.. టీమిండియాకు ‘లెఫ్ట్ హ్యాండ్’ కలిసి వచ్చింది..
టీమిండియాను దురదృష్టం ఇన్నాళ్లు శని పట్టినట్టే పట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మ్యాచులకు పైగా టాప్ ఓటమి.
By: A.N.Kumar | 6 Dec 2025 4:20 PM ISTటీమిండియాను దురదృష్టం ఇన్నాళ్లు శని పట్టినట్టే పట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మ్యాచులకు పైగా టాప్ ఓటమి. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ ఓటమి నుంచి మొదలు పెడితే నిన్నటి సౌతాఫ్రికాతో 2వ వన్డే వరకూ వరుసగా 20 మ్యాచులలో టాస్ ఓడిపోయింది. కానీ ఈరోజు అద్భుతమే జరిగింది. టీమిండియాకు లెఫ్ట్ హ్యాండ్ కలిసి వచ్చింది. ఇన్నాళ్లుగా ఓడిన టాస్ ఈసారి మన పక్షాన నిలిచింది. టీమిండియాను వెంటాడిన ఈ విచిత్రమైన ‘టాస్’ శాపం ఎట్టకేలకు ముగిసినట్టైంది.
వన్డే ఫార్మాట్ లో వరుసగా 20 టాస్ లు ఓడిపోవడం అనేది ఒక ప్రపంచ రికార్డ్. ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితే నేడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఈ వరుస ఓటములకు భారత జట్టు ఎడమ చేతితో కెప్టెన్ రాహుల్ టాస్ వేసి బ్రేక్ చేశాడు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 20 వరుస ఓటములతో గత రెండు మ్యాచులలో పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ఈసారి భిన్నంగా టాస్ కు వచ్చాడు. ఓ ఆసక్తికరమైన పని చేశాడు. ఎప్పటిలా టాస్ నాణేన్ని కుడిచేతికి బదులుగా.. ఎడమ చేతితో ఎగరేశాడు. ఈ వింత ప్రయత్నం ఫలించింది. టీమిండియా టాస్ గెలవడం వివేశం.
వరుసగా 20 ఓటముల తర్వాత విజయం దక్కడంతో కెప్టెన్ రాహుల్ తోపాటు స్డేడియంలోని అభిమానులు సైతం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడం విశేషం. టాస్ గెలిచిన ఆనందం రాహుల్ ముఖంలో కనిపించింది. చిరునవ్వుతో ఉత్సాహంగా పిడికిలి బిగించి సంబరాలు చేసుకోవడం విశేషం.టాస్ గెలిచి రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే భారత్ గెలవగా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. మూడో వన్డే ఇప్పుడు మన విశాఖలో జరుగుతోంది. సౌతాఫ్రికా ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి 216/5 వికెట్లతో ఆడుతోంది.
ఈ మ్యాచ్ విశాఖలో జరగడం.. టీంలోకి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు మొదటి సారి వన్డే జట్టులో చోటు కల్పించడం విశేషం. ఈ డూ ఆర్ డై ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ విజయం. సో టఫ్ ఫైట్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇప్పటికే టెస్టుల్లో వైట్ వాష్ కు గురైన టీమిండియా కనీసం వన్డేల్లోనైనా సిరీస్ గెలిచి సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. కానీ అంత ఈజీగా వ్యవహారంసాగేలా కనిపించడం లేదు. ఈరోజు ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
