బాడీ షేమింగ్ పై స్మృతి మంధాన అదిరిపోయే రియాక్షన్!
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన అంటే మైదానంలో పరుగుల వరద పారించే 'క్లాస్' ప్లేయర్. కానీ, సోషల్ మీడియాలో కొందరు ఆమె ఫిట్‌నెస్‌ను కూడా ట్రోల్ చేయడం విడ్డూరం.
By: Madhu Reddy | 12 May 2026 9:00 PM ISTభారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన అంటే మైదానంలో పరుగుల వరద పారించే 'క్లాస్' ప్లేయర్. కానీ, సోషల్ మీడియాలో కొందరు ఆమె ఫిట్‌నెస్‌ను కూడా ట్రోల్ చేయడం విడ్డూరం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు స్మృతి చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చారు. ఒక అథ్లెట్‌గా ఫిట్‌గా ఉండటం గర్వకారణమని చెబుతూ ట్రోలర్ల నోళ్లు మూయించారు. ఆ వివరాలు చూద్దాం..
ట్రోలర్లకు స్మృతి స్వీట్ వార్నింగ్:
మహిళా క్రికెటర్లు మైదానంలో ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిందే. అయితే, స్మృతి మంధాన ఒకసారి స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆమె చేతులకు కండలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు. ఇక దీనిపై ఆమె స్పందిస్తూ.. "కండలు ఉండటం తప్పు అన్నట్లుగా నన్ను ట్రోల్ చేశారు, అది చాలా వింతగా అనిపించింది. నిజానికి ఒక అథ్లెట్‌గా లేదా మనిషిగా కండలు కలిగి ఉండటం, ఫిట్‌గా ఉండటం అనేది అత్యుత్తమమైన విషయం" అని గట్టిగా చెప్పారు.
జిమ్‌లో కష్టపడేది అందుకే:
మనం ఫిట్‌గా, టోన్డ్ బాడీతో ఉండటానికి జిమ్‌లో గంటల కొద్దీ చెమట ఓడుస్తామని స్మృతి గుర్తు చేశారు. "అంత కష్టపడి సంపాదించుకున్న ఫిట్‌నెస్‌ను చూసి గర్వపడాలి కానీ, ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు" అని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం ఇక ఆట కోసమే కాకుండా, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి బాడీ ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో ఆమె మాటల్లో స్పష్టమైంది.
పదహారేళ్లకే అంతర్జాతీయ ఎంట్రీ:
ఇక ముంబైకి చెందిన ఈ స్టార్ ఓపెనర్ ఆటపై మక్కువతో కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే, తన బ్యాట్‌తో సమాధానం చెప్పడమే ఆమెకు తెలుసు. ఇక తాజాగా ఆమె సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే, మహిళా క్రికెట్‌లో ఆమె ఒక ధృవతారలా కనిపిస్తోంది.
మెగ్ లానింగ్ రికార్డుపై కన్ను:
ప్రస్తుతం స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అతి పిన్న వయసులో అంతర్జాతీయంగా 7,000 పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్ పేరిట ఉంది. లానింగ్ 29 ఏళ్ల 13 రోజులకు ఈ ఘనత సాధించగా, స్మృతి ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారిస్తూ భారత్‌కు ఎన్నో విజయాలను అందిస్తున్నారు.
బాహ్య సౌందర్యం కంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం ముఖ్యమని స్మృతి మంధాన నిరూపించారు. ట్రోలింగ్ చేసేవారిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. "హనీ ఈజ్ బెస్ట్" అన్నట్లుగా క్రికెట్‌లో "స్మృతి ఈజ్ బెస్ట్" అని ఆమె నిరూపిస్తున్నారు. ఇక ఫిట్‌నెస్‌ను ఎగతాళి చేసే వారికి ఆమె సమాధానం ఒక కనువిప్పు లాంటిది.
