Begin typing your search above and press return to search.

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ సంచలనం!

టీమ్‌ఇండియా బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన , జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ల మధ్యలో ఈ దేశవాళీ టోర్నీ జరగనుంది.

By:  A.N.Kumar   |   10 Oct 2025 10:36 AM IST
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ సంచలనం!
X

టీమ్‌ ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ మైదానంలో మళ్లీ సందడి చేయబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో పెను ఉత్సాహాన్ని నింపింది. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది.

* 2027 ప్రపంచ కప్ దిశగా కీలక ప్రణాళిక

2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ , సెలక్టర్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్ మరియు ఫార్మ్‌ను నిరంతరం కొనసాగించాలని, అందుకోసం దేశవాళీ టోర్నీలలో భాగం కావాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ స్పష్టమైన సందేశం పంపినట్లు తెలుస్తోంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లందరికీ ఇచ్చిన సందేశం: "దేశవాళీ క్రికెట్ ఆడండి, మీ రూట్స్‌ గుర్తుంచుకోండి". అని స్పష్టం చేశారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ సెలక్టర్ల సూచనకు సానుకూలంగా స్పందించి, రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో "3-4 మ్యాచులు ఆడేందుకు సిద్ధం" అని తెలియజేసినట్లు క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.

* బిజీ షెడ్యూల్‌లోనూ ప్లాన్!

టీమ్‌ఇండియా బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన , జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ల మధ్యలో ఈ దేశవాళీ టోర్నీ జరగనుంది. ఈ విండోను ఉపయోగించుకుని రోహిత్, కోహ్లీ ట్రోఫీలో పాల్గొనాలనే ప్రణాళికను బీసీసీఐ పరిశీలిస్తోంది.

* యువ క్రికెటర్లకు ఆదర్శం, అభిమానుల్లో సంబరాలు

సీనియర్ స్టార్ ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడటం వల్ల, కేవలం వారి ఫామ్‌ను నిరూపించుకోవడమే కాకుండా, యువ క్రికెటర్లకు అమూల్యమైన అనుభవం, మార్గదర్శకత్వం లభిస్తుంది. యువ ఆటగాళ్లు తమ దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మొత్తానికి, భారత క్రికెట్ వ్యవస్థలో కొత్త శక్తిని నింపడానికి.. యువ ప్రతిభకు సరైన మార్గదర్శకత్వం అందించడానికి ఈ ఇద్దరు దిగ్గజాల నిర్ణయం చారిత్రక ఘట్టంగా నిలవనుంది.