వయసైపోయిందన్న వాళ్లకు ‘సింగిల్’ ఇన్నింగ్స్‌తో సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ!
పాపం.. మన క్రికెట్ పండితులు.. సోషల్ మీడియా మేధావుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది.
By: A.N.Kumar | 20 July 2026 11:20 AM ISTపాపం.. మన క్రికెట్ పండితులు.. సోషల్ మీడియా మేధావుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. మొన్నటివరకు "రోహిత్‌కు వయసైపోయింది.. వన్డేల నుంచి రిటైర్ అయిపోతే బెటర్.. కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి" అంటూ ల్యాప్‌టాప్‌లు, కీబోర్డుల ముందు కూర్చుని తెగ మేధోమథనం చేసేశారు. కట్ చేస్తే నిన్నటి మ్యాచ్‌తో మన హిట్‌మ్యాన్ ఆ విమర్శకుల నోళ్లకు ఏకంగా ‘డక్ టేప్’ వేసేశాడు.
మాటలతో కాదు బాసూ.. బ్యాట్‌తో సమాధానం చెప్పడం రోహిత్ శర్మకు వెన్నతో పెట్టిన విద్య. నిన్నటి మ్యాచ్‌లో ఆయన ఆడిన ఇన్నింగ్స్ చూశాక.. విమర్శకులంతా గూగ్లీ పడిన బ్యాట్స్‌మెన్‌లా క్లీన్ బౌల్డ్ అయిపోయారు.
తొడ కండరాలు పట్టేసినా.. తగ్గేదేలే
మ్యాచ్ మధ్యలో పాపం రోహిత్‌కు తొడ కండరాలు పట్టేసి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. సాధారణంగా అయితే "అబ్బా.. నొప్పి" అంటూ రిటైర్డ్ హర్ట్‌గా పవలియన్ చేరి హాయిగా ఏసీలో రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది హిట్‌మ్యాన్ కదా.. నొప్పిని కూడా పక్కనపెట్టి, ప్రతి పరుగు కోసం మైదానంలో కష్టపడుతూ జట్టును గట్టెక్కించాడు. "వయసైపోయింది.. ఫిట్‌నెస్ లేదు" అన్న వాళ్లకు ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చూశాక మైండ్ బ్లాక్ అయి ఉంటుంది.
చిరుతపులి ఫీల్డింగ్.. విమర్శకులకు మైండ్ బ్లోయింగ్
బ్యాటింగ్‌తోనే అనుకుంటే.. ఫీల్డింగ్‌లోనూ రోహిత్ చెలరేగిపోయాడు. గ్రౌండ్‌లో చిరుతలా దూకుతూ బంతులను ఆపుతుంటే యువ ఆటగాళ్లకు కూడా ఎక్కడ లేని పూనకాలు వచ్చేశాయి. "ఫిట్‌నెస్ లేదు" అని ట్రోల్ చేసిన వాళ్లు ఇప్పుడు స్క్రీన్ల ముందు తలలు పట్టుకుని కూర్చున్నారు.
సోషల్ మీడియాలో ‘హిట్’ వికెట్
ఇక మ్యాచ్ అయిపోవడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో అభిమానులు విమర్శకులను ఆడుకుంటున్నారు. పోస్టులు, మీమ్స్‌తో నెట్‌ఇంట్లో పెద్ద జాతరే జరుగుతోంది. "ఇప్పుడు సెప్పండి.. ఉండమంటారా? పొమ్మంటారా?" అంటూ ఒక రేంజ్ లో ట్రోలర్ల ఫ్యూజులు తీసేస్తున్నారు. "ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మనెంట్" అంటూ మరికొందరు హిట్‌మ్యాన్ రేంజ్‌ను గుర్తు చేస్తున్నారు. "హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఇక మీ షాపులు మూసేయండి" అంటూ విమర్శకులకు గట్టి వార్నింగ్‌లే ఇస్తున్నారు.
ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మనెంట్
ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవచ్చు. కానీ ఈ టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ అనే 'కెప్టెన్ కమ్ బ్యాట్స్‌మెన్' ఎంత అవసరమో నిన్నటి మ్యాచ్ క్లియర్‌గా చెప్పేసింది. ఒత్తిడిని ఎలా చిత్తు చేయాలో జట్టును ముందుండి ఎలా నడిపించాలో హిట్‌మ్యాన్‌కు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. సో.. క్రికెట్ పండితులారా.. రోహిత్ వన్డే భవిష్యత్తు గురించి మీరేం కంగారు పడకండి.. ఆయన ఎప్పుడు వెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. ప్రస్తుతానికైతే ఆ క్లాస్ ఇన్నింగ్స్‌ను చూసి ఎంజాయ్ చేయండి.. కుదిరితే కాస్త సైలెంట్‌గా ఉండండి.
