Begin typing your search above and press return to search.

45.. 77.. 11.. 19.. రోహిత్‌శర్మ కెరీర్‌లో నెంబర్లాట

రోహిత్‌శర్మ శరీరం కాస్త బొద్దుగా ఉంటుంది.. సహచర స్టార్‌ బ్యాటర్‌ కోహ్లిలా అతడు తీవ్రస్థాయి కసరత్తులతో స్లిమ్‌గా కాలేదు.

By:  Tupaki Entertainment Desk   |   8 Oct 2025 9:59 AM IST
45.. 77.. 11.. 19.. రోహిత్‌శర్మ కెరీర్‌లో నెంబర్లాట
X

కొద్ది రోజుల్లోనే టీమ్‌ ఇండియాకు మాజీ కెప్టెన్‌ అయిపోయాడు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ.. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా టూర్‌ (టెస్టులు) వరకు రోహిత్‌ టెస్టు కెప్టెన్‌. కానీ, ఐదో/చివరి టెస్టులో తుది జట్టులోనే లేడు. ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌. రోహిత్‌ కెప్టెన్‌ పదవి పోయింది. కేవలం ఒక ఆటగాడిగా దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ సిరీస్‌ ఆడుతున్నాడు. విచిత్రం ఏమంటే.. ఈ మధ్య జరిగిన వరుస పరిణామాలు రోహిత్‌ కెరీర్‌లో ఆసక్తికరంగా అనిపించాయి.

తుది 11లో చోటు కోసం 11 కిలోలు తగ్గి..

రోహిత్‌శర్మ శరీరం కాస్త బొద్దుగా ఉంటుంది.. సహచర స్టార్‌ బ్యాటర్‌ కోహ్లిలా అతడు తీవ్రస్థాయి కసరత్తులతో స్లిమ్‌గా కాలేదు. కానీ, తన సహజ ప్రతిభతో పరుగుల వరద పారించాడు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ రోహిత్‌ ఫిట్నెస్‌పై విమర్శలు మొదలయ్యాయి. మరీ గత ఏడాదిగా. ఐపీఎల్‌లో అయితే రోహిత్‌ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు వచ్చాయి. ఇక ఇటీవల ఇంగ్లండ్‌ నుంచి తిరిగొచ్చిన సమయంలో రోహిత్‌ శరీరంపై అదుపుతప్పినట్లు కనిపించాడు. కానీ, టీమ్‌ ఇండియా వన్డే జట్టు కెప్టెన్‌గా ఉండడం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌గా లేకుంటే తుది 11 మందిలోనూ చోటు దక్కదని అర్థమై 11 కిలోలు తగ్గాడు. ఇప్పడు మనం ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్‌ ఫిట్‌ మ్యాన్‌ ను చూడబోతున్నాం.

శుబ్‌ మన్‌ కో ఇచ్చాడు..

రోహిత్‌శర్మ జర్సీ నంబరు 45. చాలామందికి కలిసొచ్చే 9 అంకె ఇందులో ఉంది. ఇక రోహిత్‌ నుంచి మొన్న టెస్టు, నిన్న వన్డే కెప్టెన్సీ అందుకున్న యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ జెర్సీ నంబరు 77. దీంతోపాటు కోహ్లి 13 ఏళ్ల కిందట చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయం అయింది. 45 శకం ముగిసిందని, 77 జర్నీ మొదలైందని నాడు అతడు ట్వీటాడు. అప్పటికి గిల్‌ వయసు కేవలం 14. కానీ, రోహిత్‌ ఒక నోస్ట్రడామస్‌లా భవిష్యత్‌ను ఊహిస్తూ 77వ నంబరు జెర్సీపై ట్వీట్‌ చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ అక్టోబరు 19తో..

2007లో మొదలైన రోహిత్‌శర్మ అంతర్జాతీయ కెరీర్‌ 2027 వన్డే ప్రపంచ కప్‌వరకు సాగుతుందా? అంటే, దీనికి సమాధానం అతడు ఈ నెల 19న ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రాణించడం మీదనే ఆధారపడి ఉంటుంది అనుకోవాలి. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్‌ రాణిస్తే గనుక అతడి కెరీర్‌ కనీసం మరో ఏడాదైనా కొనసాగుతుంది. లేదంటే, ఇక వీడ్కోలు తప్పదు. లేదా సెలక్టర్లే ఎంపిక చేయకపోవచ్చు. అయితే, అభిమానులు మాత‍్రం రోహిత్‌ను ఇప్పుడు సరికొత్తగా చూస్తారని అంటున్నారు. కెప్టెన్‌గానే అతడు అద్భుతాలు చేశాడని ఇప్పుడు మరింత చెలరేగుతాడని ఆవలు పెట్టుకున్నారు.