Begin typing your search above and press return to search.

అమ్మ‌కానికి ఐపీఎల్ ‘ఛాంపియన్’.. ధ‌ర ఎన్ని వేల కోట్లు ఉంటుందో?

ఔను.. అభిమానులు ఆర్సీబీ అంటూ ఎంతో ప్రేమ‌గా 18 సీజ‌న్ల నుంచి పిలుచుకుంటున్న ఈ ఫ్రాంచైజీ వ‌చ్చే సీజ‌న్ నుంచి కొత్త యాజ‌మాన్యం చేతుల్లోకి వెళ్ల‌నుంది.

By:  Tupaki Entertainment Desk   |   6 Nov 2025 9:11 AM IST
అమ్మ‌కానికి ఐపీఎల్ ‘ఛాంపియన్’.. ధ‌ర ఎన్ని వేల కోట్లు ఉంటుందో?
X

మొద‌టి సీజ‌న్ నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో కొన‌సాగుతున్నా.. మొద‌టినుంచి మంచి జ‌ట్టుగానే పేరున్నా.. మొద‌టినుంచి గొప్ప‌గొప్ప ఆట‌గాళ్లు ప్రాతినిధ్యం వ‌హించినా 17 సీజ‌న్ల పాటు క‌ప్ కొట్ట‌లేక‌పోయింది ఆ జ‌ట్టు..! ఆట‌గాళ్ల క‌సి సీజ‌న్ ఆసాంతం కొన‌సాగ‌డంతో ఎట్ట‌కేల‌కు 18వ సీజ‌న్ లో విజేత‌గా నిలిచింది. అయితే, ఆ వెంట‌నే ఓ తీవ్ర వివాదంలోనూ చిక్కుకుంది. విజ‌యోత్స‌వం తొక్కిస‌లాట‌కు దారితీసి విషాదం నింపింది. మ‌రికొద్ది నెల‌ల్లో 19వ సీజ‌న్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలో దిగ‌నున్న వేళ అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. ఇదంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అని ఇప్ప‌టికే అర్థం అయి ఉంటుంది. ఔను.. అభిమానులు ఆర్సీబీ అంటూ ఎంతో ప్రేమ‌గా 18 సీజ‌న్ల నుంచి పిలుచుకుంటున్న ఈ ఫ్రాంచైజీ వ‌చ్చే సీజ‌న్ నుంచి కొత్త యాజ‌మాన్యం చేతుల్లోకి వెళ్ల‌నుంది.

అనుకున్న‌ట్లే... లీగ్ లో తొలిసారి

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వ‌హించే ఆర్సీబీ చేతులు మారుతుంద‌ని కొద్దినెల‌ల కింద‌ట‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ, అవ‌న్నీ నిజం అవుతాయ‌ని అనుకోలేదు. చివ‌ర‌కు అదే జ‌రిగింది. లీగ్ చ‌రిత్ర‌లో తొలిసారి ఓ డిఫెండింగ్ చాంపియ‌న్ కొత్త యాజ‌మాన్యం కింద‌కు వెళ్ల‌నుండ‌డం బ‌హుశా ఇదే మొద‌టిసారేమో..? గ‌తంలో వివిధ కార‌ణాల‌తో రైజింగ్ పుణె సూప‌ర్ జెయింట్స్, కొచ్చిన్ ట‌స్క‌ర్స్, గుజ‌రాత్ ల‌య‌న్స్ వంటి జ‌ట్లు వ‌చ్చినా అవి డిఫెండింగ్ చాంపియ‌న్లు కావు. నాలుగేళ్ల కింద‌ట వ‌చ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, గుజ‌రాత్ టైటాన్స్ ల‌దీ ఇదే ప‌రిస్థితి. కానీ, ఇప్పుడు డిఫెండింగ్ చాంపియ‌న్ అయిన బెంగ‌ళూరు కొత్త యాజ‌మాన్యం ఆధ్వ‌ర్యంలో రాబోయే సీజ‌న్ ఆడ‌నుంది.

అమ్మ‌కం షురూ..

ఆర్సీబీ విక్ర‌యం ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లైంది. ఈ ఫ్రాంచైజీ య‌జ‌మాని డియోజియో ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి స‌మాచారం ఇచ్చింది. డియోజియో... బ్రిటిష్ డిస్ట‌ల‌రీస్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)ల మ‌ద‌ర్ కంపెనీ. యూఎస్ఎల్ కు పూర్తి అనుబంధ సంస్థ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్సీఎస్పీఎల్). ఇప్పుడు పెట్టుబ‌డిదారుల కోసం చూస్తోంది. మార్చి 31వ‌ర‌కు ప్ర‌క్రియ అంతా పూర్తి కానుంది. బ‌హుశా అప్ప‌టికే ఐపీఎల్ 19 ప్రారంభం అవుతుంది.

ఎన్ని వేల కోట్లు ఉంటుందో?

ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్థాయిలో ఐదేసి టైటిల్స్ కొట్ట‌కున్నా ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ త‌క్కువ ఉండ‌దు. పైగా కోహ్లి ప్రాతినిధ్యంతో పాటు టెక్ న‌గ‌రం బెంగ‌ళూరుకు చెందిన‌ది కాబ‌ట్టి విశేష ఆద‌ర‌ణ ఉంది. ఈ ఫ్యాన్ బేస్ ప్ర‌కారం చూసినా ఆర్సీబీని ఎన్ని వేల కోట్ల‌కు కొంటారు...? ఎవ‌రు కొంటారు? అనేది ఆస‌క్తిక‌రం కానుంది.