వరుస పరాజయాల్లో భారత టీ20 జట్టు.. రజత్ పాటిదార్ ఎంట్రీకి ఇదే సరైన సమయమా?
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ భారత్ వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సెలెక్టర్లకు ఒక కీలకమైన సూచన చేశారు.
By: A.N.Kumar | 7 July 2026 1:00 AM ISTభారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల నుంచి కీలక సూచనలు వస్తున్నాయి. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శన కనిపించకపోవడం, ఐర్లాండ్ పర్యటనలో 0-2తో క్లీన్‌స్వీప్ అవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ భారత్ వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సెలెక్టర్లకు ఒక కీలకమైన సూచన చేశారు.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రజత్ పాటిదార్‌ను తక్షణమే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, కుడిచేతి వాటం కలిగిన పాటిదార్ వస్తే జట్టులో సరైన సమతుల్యత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"భారత్ టీ20 జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే రజత్ పాటిదార్‌ను తప్పకుండా పరిశీలించాలి. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, కొత్త ఆటగాళ్లను పరీక్షించడానికి ఇదే సరైన అవకాశం" అని పఠాన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
రజత్ పాటిదార్ అద్భుతమైన ట్రాక్ రికార్డ్
ఇంతవరకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనప్పటికీ, దేశవాళీ క్రికెట్ , ఐపీఎల్‌లో పాటిదార్ రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. మొత్తం ఇన్నింగ్స్‌లు 106, చేసిన పరుగులు 3,389,
స్ట్రైక్ రేట్ 160.08.. స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడం, మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబడుతాడు.
ఒక కెప్టెన్‌గా తిరుగులేని సక్సెస్
రజత్ పాటిదార్ కేవలం బ్యాటర్‌గానే కాకుండా, అద్భుతమైన నాయకుడిగానూ తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వరుసగా 2025, 2026 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిపి చరిత్ర సృష్టించాడు. ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అతని శైలి జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లండ్‌తో రెండో టీ20లో ఏం జరిగింది?
రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే ఛేదించింది. అర్షదీప్ సింగ్ ఆరంభంలో రెండు వికెట్లు తీసి ఆశలు రేపినప్పటికీ, హ్యారీ బ్రూక్ (15 బంతుల్లో 39) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జేకబ్ బెతెల్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు నోబాల్స్, ఫ్రీహిట్ల రూపంలో ఏకంగా 29 పరుగులు రావడం మ్యాచ్‌ను చేజార్చింది.
ఈ ఓటమితో ఇంగ్లండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా సెలెక్టర్లు ఇర్ఫాన్ పఠాన్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, రజత్ పాటిదార్ వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
