మెస్సీ భారత పర్యటన వేళ..రొనాల్డో చేసిన పని తెలిస్తే అవాక్కే
ప్రపంచ ప్రసిద్ధ ఫుట్ బాలర్ ఒకరు.. చాట్ జీపీటీ, గూగుల్ జెమినైలను కాదని పర్ ప్లెక్సిటీ వంటి సంస్థలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీలో చర్చగా మారింది.
By: Tupaki Political Desk | 7 Dec 2025 12:12 PM ISTఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) యుగం..! మూడేళ్ల కిందట మొదలైన ఈ ప్రభంజన ఎటుపోతుందో తెలియనంత వేగంగా దూసుకెళ్తోంది..! ఏఐ మనిషి జీవితంలో భాగం అవుతుందా? మనిషినే డామినేట్ చేస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఏఐలోకి దూసుకొచ్చింది పర్ ప్లెక్సిటీ. భారతీయుడైన అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన ఈ సంస్థ సంచలనాలు నమోదు చేస్తోంది. ఏఐలో పెద్దన్న అయిన చాట్ జీపీటీని మించి పోతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీనిని ఏఐలో ఆన్సర్ ఇంజన్ గానూ అభివర్ణిస్తున్నారు. ప్రశ్నించడమే ఆలస్యం.. జవాబే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలనూ సమకురూస్తూ విశేష ఆదరణ చూరగొంటోంది. సందర్భాన్ని కూడా సమగ్రంగా విశ్లేషించడం పర్ ప్లెక్సిటీని ప్రత్యేకంగా నిలుపుతోంది.
పోటీని తట్టుకుని.. మేటిగా ఎదిగి..
ఓపెన్ ఏఐ శకంలో ఎంత గొప్పగా ఉన్నా పోటీని తట్టుకోవడం కష్టంగా మారింది. కానీ, పర్ ప్లెక్సిటీ దీనినీ అధిగమించింది. ఓవైపు ఏఐకి మదర్ లాంటి చాట్ జీపీటీని ప్రఖ్యాత సంస్థ గూగుల్ కు చెందిన జెమినైని ఢీకొంటూ భారతీయుడు అరవింద్ శ్రీనివాస్ నెలకొల్పిన పర్ ప్లెక్సిటీ దూసుకెళ్తోంది. టెక్నాలజీలో పారదర్శకత, స్పష్టతతో యూజర్లను ఆకట్టుకుంటోంది. దీని మోడళ్లు కూడా ఈ విధంగా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
రొనాల్డోనే కట్టిపడేసి..
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్ బాల్ ప్రపంచంలోనే కాదు.. క్రీడా ప్రపంచంలోనే పరిచయం అక్కర్లేని పేరు. ఇలాంటి సంస్థలో ఈ ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ కు చెందిన రొనాల్డో పెట్టుబడి పెట్టారు. ఓవైపు అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, ఆ జట్టు కెప్టెన్ మెస్సీ భారత పర్యటనకు వస్తున్న వేళనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. ఓ భారతీయుడి సంస్థలో ఎక్కడో పోర్చుగల్ కు చెందిన రొనాల్డో పెట్టుబడి పెట్టిన ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో పర్ ప్లెక్సిటీ తన రీచ్ ను ప్రపంచ స్థాయికి విస్తరించుకునే అవకాశం మరింత దగ్గరైంది.
ఏఐ ఇండస్ట్రీలో చర్చ...
ప్రపంచ ప్రసిద్ధ ఫుట్ బాలర్ ఒకరు.. చాట్ జీపీటీ, గూగుల్ జెమినైలను కాదని పర్ ప్లెక్సిటీ వంటి సంస్థలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీలో చర్చగా మారింది. కోట్లాది మంది అభిమానులున్న రొనాల్డో తీసుకున్న నిర్ణయం ఏఐ ఇండస్ట్రీలో అతడి మొదటి అడుగు కూడా కావడం విశేషం. 25 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ఉన్న రొనాల్డో ఇప్పటికే ఎన్నో పెట్టబడులు పెట్టి ఉండొచ్చు.. కానీ, ఒక టెక్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం అనేది అది కూడా భారతీయుడి కంపెనీలోనే కావడం మరింత సంచలనంగా మారింది. దీనిని ప్రొజెక్టివ్ మూవ్ అని నిపుణులు విశ్లేషిస్తుండగా, గొప్పదనాన్ని అందుకోవాలంటే ప్రతి రోజూ కొత్త ప్రశ్నలు అడగాలి. పర్ ప్లెక్సిటీలో భాగస్వామ్యం నాకు గర్వకారణం. ప్రపంచ యాంగ్జయిటీని పెంచేందుకు ప్రయత్నిస్తా.. అని రొనాల్డో స్పందించాడు.
అరవింద్ స్పంద నిది..
తన సంస్థలో రొనాల్డో పెట్టుబడిని పర్ ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వాగతించారు. సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ పెట్టారు. ఇది తమకు దక్కిన గౌరవం అని అభివర్ణించారు. నిరంతరం కొత్తదనాన్ని వెదికే రొనాల్డో తమకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తమది ఎలైట్ కొలాబరేషన్ అని తెలిపారు.
-ఫుట్ బాల్ లో చిరకాల ప్రత్యర్థి అయిన మెస్సీ భారత పర్యటనకు వస్తున్న సమయంలోనే భారతీయుడి సంస్థలో పెట్టుబడి పెట్టి రొనాల్డో ఇక్కడా తాను అతడితో పోటీ పడతానని పరోక్షంగా చాటిచెప్పాడు.
