Begin typing your search above and press return to search.

బుమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టారు.. జన్మ ధన్యం.. ఈ పాకిస్తానోళ్లు ఇక రిటైర్ కావచ్చు..

క్రికెట్ చరిత్రలోనే బుమ్రా వేసిన యార్కర్ కొద్దిగా మిస్సై ఫుల్‌టాస్‌‌గా పడటం, దానిని సిక్సర్‌గా కొట్టడం అరుదైన విషయమే కావచ్చు.

By:  A.N.Kumar   |   6 Oct 2026 4:20 PM IST
బుమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టారు.. జన్మ ధన్యం.. ఈ పాకిస్తానోళ్లు ఇక రిటైర్ కావచ్చు..
X

‘‘బుమ్రా బౌలింగ్‌లో ఒక్క సిక్స్ కొట్టేశాం.. ఇక జన్మ ధన్యమైపోయింది ఈ పాకిస్థాన్ క్రికెటర్లు ఏకంగా ఆటకే రిటైర్మెంట్ ప్రకటించినా తప్పులేదు" ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి గోల్డ్ మెడల్ పోగొట్టుకున్నా, బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదామన్న ఒకే ఒక్క షాట్‌ను ఏకంగా ‘హిస్టారికల్ అచీవ్‌మెంట్’గా ప్రచారం చేసుకుంటున్న పాక్ నెటిజన్ల అతి చూస్తుంటే.. భారత్ విసిరే సెటైర్లు నెక్స్ట్ లెవెల్‌లో పేలుతున్నాయి..

ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 192/6 పరుగులకే పరిమితమై 19 పరుగుల తేడాతో బంగారు పతకాన్ని టీమిండియాకు సమర్పించుకుంది. అయితే ఇక్కడే ఒక అసలైన కామెడీ మొదలైంది. మ్యాచ్ ఓడిపోయాం.. చేతికి వచ్చిన గోల్డ్ మెడల్ పోయింది అనే బాధ పాక్ క్రికెట్ వర్గాల్లో కంటే.. "మేము జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్ కొట్టేశాం" అనే ఆనందమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఔను పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18.3వ ఓవర్‌లో సాద్ మసూద్ మన బుమ్రా వేసిన ఒక ఫుల్‌టాస్ బంతిని సిక్సర్‌గా మలచడమే ఇప్పుడు పాక్ సోషల్ మీడియా పేజీలకు అతిపెద్ద నేషనల్ అచీవ్‌మెంట్ అయిపోయింది. అసలు మ్యాచ్ ఫలితం చివరికి పసిడి పతకం గెలిచింది భారత్ అనే విషయాన్ని పక్కనపెట్టి బుమ్రా బౌలింగ్‌లో పడ్డ ఆ ఒక్క సిక్సర్ వీడియోను దాని గణాంకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొందరు పాక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

క్రికెట్ చరిత్రలోనే బుమ్రా వేసిన యార్కర్ కొద్దిగా మిస్సై ఫుల్‌టాస్‌‌గా పడటం, దానిని సిక్సర్‌గా కొట్టడం అరుదైన విషయమే కావచ్చు. కానీ దాన్ని పాకిస్థాన్ ఏకంగా ఓ వరల్డ్ కప్ గెలిచిన రేంజ్‌లో ప్రచారం చేసుకోవడం చూసి భారత అభిమానులు నవ్వుకుంటున్నారు. "బుమ్రా బౌలింగ్‌లో ఒక సిక్సర్ కొట్టడానికే ఇంత రేంజ్‌లో పోస్టర్లు, వీడియోలు విసిరేస్తుంటే.. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే పాకిస్థాన్ పండుగ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది " అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి సాద్ మసూద్ 5 బంతుల్లో 12 పరుగులు చేసి రెండు సిక్సర్లు బాదాడు, హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులు చేసి వీరోచితంగా పోరాడాడు. కానీ ఈ మెరుపులు ఏవీ కూడా పాకిస్థాన్‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయాయి. బుమ్రా ఆ ఒక్క సిక్సర్ ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కంగారు పడకుండా కట్టుదిట్టమైన డెత్ ఓవర్ బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను కట్టడి చేశాడు. తన 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు.

స్కోర్‌బోర్డ్, విజయం, చివరకు మెడలో పడే పసిడి పతకం.. ఈ మూడూ భారత్ ఖాతాలోనే పడ్డాయి. పాకిస్థాన్‌కు మాత్రం ఆ సిక్సర్ల జ్ఞాపకాలు, రజత పతకం మాత్రమే మిగిలాయి. అంతిమంగా మ్యాచ్ గెలిచి స్వర్ణం తెచ్చుకోవడం భారత్‌‌కు అలవాటైతే.. ఓడిపోయినా కూడా చిన్న చిన్న షాట్లను చూసుకుని మురిసిపోవడం పాకిస్థాన్‌కు పరిపాటిగా మారింది.