శత్రువులు ఎక్కడో ఉండరు.. ఔట్ కాగానే హార్దిక్ కు షాకిచ్చిన ప్రియురాలు
ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. హార్దిక్ అవుట్ అయితే ఎమోషనల్ అవ్వాల్సింది పోయి, ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని అభిమానులు మండిపడుతున్నారు.
By: A.N.Kumar | 23 Feb 2026 11:11 AM ISTక్రికెట్ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని అవమానం ఎదురైంది. ప్రత్యర్థి బౌలర్ల కంటే కూడా గ్యాలరీలో ఉన్న తన ప్రియురాలి ప్రవర్తనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
ఆ ఒక్క షాట్.. ఆ ఒక్క రియాక్షన్!
మ్యాచ్ కీలక దశలో ఉంది. క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ అది క్యాచ్ అవుట్‌గా మారింది. 18 పరుగుల వద్ద హార్దిక్ పెవిలియన్ దారి పట్టడంతో స్టేడియం అంతా నిశ్శబ్దమైపోయింది. కానీ, సరిగ్గా అదే సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న హార్దిక్ ప్రియురాలు మహికా శర్మ అనూహ్యంగా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నట్లు కనిపించింది.
నెటిజన్ల ఆగ్రహం
ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. హార్దిక్ అవుట్ అయితే ఎమోషనల్ అవ్వాల్సింది పోయి, ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని అభిమానులు మండిపడుతున్నారు. "శత్రువులు ఎక్కడో ఉండరు.. హార్దిక్ ఇంట్లోనే ఉన్నారు" అంటూ కొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్‌కు టైమ్ బాగోలేదని, ఇలాంటి వారు పక్కన ఉండటం వల్లే ఆయనకు కలిసి రావడం లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు నిజం అదేనా?
మరోవైపు మహికా శర్మకు మద్దతుగా కూడా కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. బంతి గాలిలోకి లేచినప్పుడు ఆమె అది సిక్సర్ అని పొరపడి ఉండొచ్చని, ఆ ఉత్సాహంలోనే చప్పట్లు కొట్టి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మైదానంలో ఉన్న దూరం వల్ల ఒక్కోసారి అవుట్ అయిందా లేదా బౌండరీ దాటిందా అనేది స్పష్టంగా తెలియక ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని వారు వెనకేసుకొస్తున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ..
ఏది ఏమైనా హార్దిక్ అవుట్ కంటే మహికా శర్మ రియాక్షనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి దీనిపై చర్చించుకుంటున్నారు. ఒక వైపు విమర్శలు, మరోవైపు వివరణలతో ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
