Begin typing your search above and press return to search.

అర్జెంటీనా చిన్న బాలుడు నేడు ప్రపంచ సాకర్ రాజు ఎలా అయ్యాడు?

మెస్సీ విజయంలో అత్యంత ముఖ్యమైన అంశాలు అతడి అంకితభావం. కృషి.. మైదానంలో అతడి ప్రతి అడుగు, గోల్ అతడి కష్టాన్ని తెలియజేస్తాయి.

By:  A.N.Kumar   |   15 Dec 2025 4:45 PM IST
అర్జెంటీనా చిన్న బాలుడు నేడు ప్రపంచ సాకర్ రాజు ఎలా అయ్యాడు?
X

ఒకప్పుడు అర్జెంటీనా వీధుల్లో పరుగులెత్తిన చిన్నారి బాలుడు అతడు. నేడు ప్రపంచ సాకర్ సింహాసనాన్ని అధిష్టించాడు. అతడే లియోనల్ మెస్సీ. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాడిగా.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ‘రాజు’గా నిలిచాడు. అతడి అద్భుత ప్రయాణం కేవలం ప్రతిభకు, నిరంతర కృషికి నిదర్శనం.

మెస్సీ విజయంలో అత్యంత ముఖ్యమైన అంశాలు అతడి అంకితభావం. కృషి.. మైదానంలో అతడి ప్రతి అడుగు, గోల్ అతడి కష్టాన్ని తెలియజేస్తాయి. కానీ విజయాల వెనుక అతడు చిన్నప్పటి నుంచి అనుభవించిన కష్టాల కడలి ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకోవడానికి కూడా సదుపాయాలు లేని స్థితి నుంచి కష్టపడి ఆటలు ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు.

మెస్సీ విమానం.. గాల్లో ఎగిరే ప్యాలెస్

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే క్రీడాకారులలో ఒకరైన లియోనల్ మెస్సీ యొక్క ఆస్తుల్లో ఒకటి అతడి విలాసవంతమైన ప్రైవేట్ జెట్. ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం కాదు. అతడి విజయవంతమైన జీవితానికి ప్రతీక. దీనికి ధర సుమారు రూ.125 కోట్లు. ఇది అత్యాధునిక గల్ఫ్ స్ట్రీమ్ వీ జెట్. ఈ జెట్ లోపల అత్యంత విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. ఇది గాల్లో ఎగురుతున్న ఒక ప్యాలెస్ లా ఉంటుంది. ఆట తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబతో గడపడానికి ముఖ్యమైన ప్రయాణాలు వేగంగా పూర్తి చేయడానికి ఈ జెట్ మెస్సీకి ఎంతో ఉపయోగపడుతుంది.

మెస్సీ ఎంతో ముఖ్యమైన మ్యాచ్ లకు అంతర్జాతీయ ప్రయాణాలకు ఈ జెట్ ను ఉపయోగిస్తాడు. వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం అతడికి శారీరక, మానసిక విశ్రాంతిని అందించి తదుపరి మ్యాచ్ లకు సిద్ధం కావడానికి సహాయపడుతుంది.

లియోనల్ జీవితం ఓ గుణపాఠం

లియోనల్ మెస్సీ ప్రయాణం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం చెబుతోంది. ప్రతిభ, కఠోరశ్రమ ఉంటే విజయాన్ని అందుకోవడానికి ఆకాశమే హద్దు అని మెస్సీ నిరూపించాడు. మెస్సీ తన ప్రతిభను గుర్తించి దానికి తగ్గట్టుగా నిరంతరం కృషి చేశాడు. అతడి సంపాదన అతడికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించింది. ఇవి అతడి విజయపరంపరను కొనసాగించడానికి దోహదపడ్డాయి.