Begin typing your search above and press return to search.

సచిన్ ను మించి.. కోహ్లీ 100 సెంచరీలు సాధ్యమేనా?

కరోనా తర్వాత ఫాం కోల్పోయిన టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఆపసోపాలు పడ్డారు.

By:  A.N.Kumar   |   7 Dec 2025 5:50 PM IST
సచిన్ ను మించి.. కోహ్లీ 100 సెంచరీలు సాధ్యమేనా?
X

కరోనా తర్వాత ఫాం కోల్పోయిన టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఆపసోపాలు పడ్డారు. టెస్టులు, వన్డేలు , టీ20ల్లో ఫాం కోల్పోయి నానా తంటాలు పడ్డారు. ఇటీవలే టెస్టులకు రిటైర్ మెంట్ ప్రకటించాక ఇక వన్డేల్లోనే కొనసాగుతున్నారు. కోచ్ గౌతం గంభీర్ వల్ల రోహిత్, కోహ్లీల సీటుకే ఎసరు వస్తుంది. అలాంటి సమయంలో సౌతాఫ్రికాపై వరుస సెంచరీలతో రాణించిన కోహ్లీ వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. గంభీర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సౌతాఫ్రికా సిరీస్ లో విరాట్ కోహ్లీ చూపించిన విశ్వరూపం క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి నివ్వెరపోయేలా చేసింది. పది నెలల సుధీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ పరగుల వరద పారించాడు. తన ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండు అద్భుతమైన సెంచరీలతో ఏకంగా 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా అవార్డును దక్కించుకున్నడు. ఈ అసాధారణమైన ఫామ్ చూస్తుంటే.. ‘క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్’ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించగలడా? అనే చర్చ మళ్లీ జోరందకుంది.

కోహ్లీకి 100 సెంచరీలు కొట్టడం పెద్ద కష్టం కాదు : గవాస్కర్

కోహ్లీ 100 సెంచరీల రికార్డుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చశాడు. కోహ్లీ వంద సెంచరీలు పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డును సమం చేయాలంటే మరో 16 సెంచరీలు అవసరం. గవస్కర్ లెక్క ప్రకారం.. మరో మూడేళ్లు కోహ్లీ క్రికెట్ ఆడితే చాలు సులభంగా ఈ అసాధ్యమైన మైలురాయిని కోహ్లీ చేరుకోవడం ఈజీ అని చెబుతున్నాడు. మొన్నటి సౌతాఫ్రికా సిరీస్ లో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు. రేపు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో మరో రెండు కొడితే 87 అవతాయి. అలా చూసుకుంటే వంద సెంచరీలు కొట్టే అవకాశం చాలా ఎక్కవగా ఉంటుంది అని గవాస్కర్ జోస్యం చెప్పారు.

వైజాగ్ లో కోహ్లీ ఆటతీరు చూసి గవాస్కర్ పూర్తిగా ఫిదా అయ్యారు. వన్డే ఫార్మాట్ లో కోహ్లీని ఇలాంటి టీ20 అవతారంలో ఎప్పుడూ చూడడం చాలా అరుదని వ్యాఖ్యానించారు. గెలుపు దాదాపు ఖాయమైన ఈ మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా కోహ్లీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచే షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ ఇన్నింగ్స్ లో ఒక్కటి కూడా రిస్క్ షాట్ ఆడకపోవడం విశేషం.

మొత్తంగా గవస్కార్ అంచనాలను బట్టి కోహ్లీ బ్యాటింగ్ ప్రస్తుతం ఎంతో పర్ఫెక్షన్ గా ఉంది. ఒక్కటంట ఒక్కటి ఇన్ సైడ్ ఎడ్జ్ కానీ.. అవుట్ సైడ్ ఎడ్జ్ గానీ కనిపించలదు. దీన్ని బట్టి కోహ్లీ ఎంత పర్ ఫెక్ట్ గా, క్లాసీగా కోహ్లీ బ్యాటింగ్ చేశాడని చెప్పొచ్చు.