Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ దిశ‌గా టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్..!

రాహుల్ 67 టెస్టులు ఆడాడు. 35.8 స‌గ‌టుతో 4,053 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్ స్థాయం కావ‌డంతో గ‌త ఏడాది ఇంగ్లండ్ టూర్ తోనే రాహుల్ కు మంచి ఎలివేష‌న్ వ‌చ్చింది.

By:  Tupaki Political Desk   |   28 Jan 2026 7:12 PM IST
రిటైర్మెంట్ దిశ‌గా టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్..!
X

ర‌విచంద్ర‌న్ అశ్విన్, విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, చ‌తేశ్వ‌ర్ పుజారా.. గ‌త ఏడాది వ‌రుస‌గా టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకొన్న టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్లు. వీరిలో పుజారా త‌ప్ప మిగ‌తా ముగ్గ‌రూ జ‌ట్టులో కొన‌సాగుతున్నారు. కోహ్లి, రోహిత్ వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. వీరితో పాటు టి20ల‌కు గుడ్ బై చెప్పిన సీనియ‌ర్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వ‌న్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతాడ‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. టెస్టుల్లోనూ బంతితో జ‌డేజా ప్ర‌ద‌ర్శ‌న అనుకున్నంతగా లేదు. ఈ స్టార్ ఆల్ రౌండ‌ర్ కూడా రిటైర్మెంట్ ఇస్తాడ‌నే క‌థ‌నాలు వ్యాపించాయి. అయితే, వీరు కాకుండా మ‌రో కీల‌క ఆట‌గాడు కూడా రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడు. ఇప్ప‌టికే టి20 జ‌ట్టులో చోటు లేని అత‌డు.. వ‌న్డేల్లో, టెస్టుల్లో మాత్రం రెగ్యుల‌ర్ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు. మ‌రి ఏ ఫార్మాట్ నుంచి వైదొల‌గేది ఇంకా స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. బ‌హుశా త‌న‌కు అవ‌కాశం ద‌క్క‌ని ఫార్మాట్ నుంచి త‌ప్పుకొంటాడేమో చూడాలి.

వ‌య‌సు చూసుకుని...

టెస్టుల్లో ఓపెన‌ర్ గా, వ‌న్డేల్లో వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ గా స్థిర‌ప‌డ్డాడు కేఎల్ రాహుల్. 2014లోనే టీమ్ఇండియాలోకి వ‌చ్చినా చాలా ఏళ్లు స్థానం ప‌దిలం చేసుకోలేక‌పోయాడు. గాయాలు, వైఫ‌ల్యాలు దీనికి కార‌ణం. నాలుగైదేళ్లుగా మాత్రం పాతుకుపోయాడు. అయితే, టి20ల్లోయువ‌కుల‌కు చాన్స్ లు ఇచ్చిన సెల‌క్ట‌ర్లు రాహుల్ ను ప‌క్క‌న‌పెట్టారు. రెండేళ్లుగా పూర్తిగా కుర్రాళ్ల‌నే ఎంపిక చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కూ రిటైర్మెంట్ ఆలోచ‌న‌లు వ‌చ్చాయ‌ని అంటున్నాడు కేఎల్ రాహుల్. కానీ, దీనికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని చెప్పాడు.

కెరీర్ సాగ‌దీయ‌ను..

రిష‌భ్ పంత్ వంటి హార్డ్ హిట్ట‌ర్ ను కాద‌ని రాహుల్ ను వ‌న్డేల్లో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ గా కొన‌సాగిస్తున్నారు. టెస్టుల్లో గ‌త ఏడాది రోహిత్ రిటైర్మెంట్ తో రాహుల్ కు ఓపెనింగ్ చాన్స్ ద‌క్కింది. మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ తో క‌లిసి రాహుల్ బ‌రిలో దిగుతున్నాడు. కాబ‌ట్టి ఈ రెండు ఫార్మాట్ల‌లో కొన‌సాగుతాడు. ఇక ఎలాగూ 33 ఏళ్లు కాబ‌ట్టి అత‌డికి టి20 చాన్స్ లేదు. దీంతోనే త‌న‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు రిటైర్ అవుతాన‌ని, కెరీర్ ను సాగ‌దీయ‌బోన‌ని చెప్పాడు. రిటైర్మెంట్ అనేది అంత క‌ష్ట‌మైన ప‌ని కాద‌ని కూడా అన్నాడు. ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశాడు. కాక‌పోతే, రాహుల్ ను ఎలాగూ టి20ల‌కు ప‌రిగ‌ణించ‌డం లేదు కాబ‌ట్టి, మ‌రో ఏడాదిలో అత‌డు ఈ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికినా ఆశ్చ‌ర్యం లేదు.

వ‌న్డేల్లో బెస్ట్..

రాహుల్ 67 టెస్టులు ఆడాడు. 35.8 స‌గ‌టుతో 4,053 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్ స్థాయం కావ‌డంతో గ‌త ఏడాది ఇంగ్లండ్ టూర్ తోనే రాహుల్ కు మంచి ఎలివేష‌న్ వ‌చ్చింది. ఇక ఒక ద‌శ‌లో వ‌న్డేల్లో వ‌రుస‌గా హాఫ్ సెంచ‌రీలు చేసిన రాహుల్ కు జ‌ట్టులో చోటు స్థిరం కాలేదు. అజింక్య ర‌హానే వంటి ప్లేయ‌ర్ ఉండ‌డమే దీనికి కార‌ణం. ఇప్పుడు మాత్రం వ‌న్డేల్లోనూ పాతుకుపోయాడు. 94 వ‌న్డేలు ఆడిన అత‌డు 50.90 స‌గ‌టుతో 3360 ప‌రుగులు చేశాడు. 72 టి20ల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన రాహుల్... 2,265 ప‌రుగులు సాధించాడు. స‌గ‌టు 37.75.

ఇప్పుడే ఆ మాట ఎందుకు?

ప్ర‌స్తుతం టీమ్ఇండియా న్యూజిలాండ్ తో టి20 సిరీస్ ఆడుతోంది. బుధ‌వారం విశాఖ‌ప‌ట్నంలో మ్యాచ్ ఉంది. ఈ స‌మ‌యంలో రాహుల్ రిటైర్మెంట్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయం అయ్యాయి. టెస్టులు, వ‌న్డేల్లో జ‌ట్టులో చోటు ఖాయం అయిన ఆట‌గాడి నుంచి ఇలాంటి మాట‌లు రావ‌డం అనేది ఉండ‌దు. రిటైర్మెంట్ మాట కూడా రాహుల్.. ఇంగ్లండ్ మాజీ బ్యాట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ తో ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చేయ‌డం గ‌మ‌నార్హం.