పాకెట్ డైనమైట్ జెమీమా.. మనీ పాకెట్ కూడా పెద్దదే..!
జెమీమా ప్రస్తుతం బీసీసీఐ మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో బీ గ్రేడ్ లో ఉంది. దీనికిగాను ఆమెకు ఏడాదికి రూ.30 లక్షలు వస్తాయి.
By: Tupaki Political Desk | 1 Nov 2025 9:09 AM ISTఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. అంతా జెమీమామయం..! మొన్నటివరకు మైదానంలో గెంతులతో పాపులర్ అయిన ఈ అమ్మాయి ఇప్పుడు నేషనల్ హీరో(యిన్)...! ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ లో అజేయ సెంచరీ కొట్టి జట్టును జెమీమాను అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిన్నటివరకు జెమీమాను అద్భుత ఫీల్డర్ గానే గుర్తించిన అభిమానులు ఇప్పుడు గొప్ప పోరాటయోధురాలు అని కీర్తిస్తున్నారు. ఇదంతా సరే.. జెమీమా నేపథ్యం ఏమిటి.?? అంటే ఈమె కుటుంబానికి మహారాష్ట్ర. ఆర్థికంగా ఎగుమ మధ్య తరగతి నేపథ్యమే. తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తి చూసి వీరు బందూప్ నుంచి ముంబైలోని ఖరీదైన బాంద్రాకు మారారు. ఇక 25 ఏళ్ల జెమీమా పలు రంగాల్లో ప్రావీణ్యం ఉన్న అమ్మాయి.
గిటార్ ఫ్రీక్ కదా? అన్న రోహిత్..
జెమీమాకు గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. ఇదే విషయమై ఆమెను టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ ఓసారి నువ్వు గిటార్ ఫ్రీక్ కదా? అని అడిగాడు. దీనికి అవును అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక జెమీమా సోషల్ మీడియా స్టార్. రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాలో 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టీమ్ ఇండియా సహచర స్టార్.. మంథానతో కలిసి ఆమె చేసిన రీల్స్ చాలా పాపులర్. ఇక ఏడేళ్లుగా టీమ్ ఇండియాకు ఆడుతున్న జెమీమా మైదానంలో చేసే డ్యాన్సులకు అభిమానులు ఫిదా అవుతుంటారు. నాలుగేళ్లకే పలు క్రీడల్లో అడుగుపెట్టిన ఈ ముంబైకర్ కు హాకీ, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లోనూ ప్రవేశం ఉంది.
కోటీశ్వరురాలే...!
టీమ్ ఇండియాకు ఏడేళ్లుగా ఆడుతున్నా.. హర్మన్ ప్రీత్, మంథాన స్థాయిలో జెమీమాకు ఆదాయం లేదు అనే చెప్పాలి. ఎందుకూ అంటే.. మిడిలార్డర్ బ్యాటర్ గా సాధారణ ప్రదర్శన చేయడమే. ఇప్పుడు మాత్రం జెమీమా దశ తిరుగుతుందనే చెప్పాలి. జెమీమాను ఆమె అద్భుత ఫీల్డింగ్, దూకుడైన బ్యాటింగ్, మైదానంలో డ్యాన్సులు చూసి పాకెట్ డైనమైట్ అంటారు. మరి ఈ పాకెట్ డైనమైట్ మనీ పాకెట్ ఏమిటో తెలుసా?
గ్రేడ్ బి నుంచి గ్రేడ్ ఏ లోకి ఖాయమా?
జెమీమా ప్రస్తుతం బీసీసీఐ మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో బీ గ్రేడ్ లో ఉంది. దీనికిగాను ఆమెకు ఏడాదికి రూ.30 లక్షలు వస్తాయి. మ్యాచ్ ఫీజులు చూస్తే టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టి20లకు రూ.3 లక్షలు ఇస్తారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో జెమీమా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతుంది. ఈమెను రూ.2.2 కోట్లకు ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. కాగా, ప్రస్తుత మహిళల ప్రపంచ కప్ ఫైనల్లోనూ జెమీమా అదరగొడితే ఈమె గ్రేడ్ ను బీసీసీఐ ఏ లోకి చేర్చడం ఖాయమే.
మంథానను మించుతుందా..?
ప్రస్తుతం మహిళల క్రికెట్ లో మంథాన రికార్డు స్థాయిలో పదుల సంఖ్యలో అడ్వర్జయిజ్ మెంట్లు చేస్తోంది. మున్ముందు జెమీమా ఆమెను బీట్ చేసే చాన్సుంది. అయితే, అది ప్రపంచ కప్ ఫైనల్లో విజయం, ఆమె రాణించడంపై ఆధారపడి ఉంటుంది. జెమీమా ఇప్పుడు హ్యుందాయ్, జిల్లెట్, ప్లాటినం ఎవారా, రెడ్ బుల్ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంది. ఈమె నికర ఆస్తి రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్లు అని అంచనా. ప్రపంచ కప్ ముగిశాక.. డబ్ల్యూపీఎల్ వేలంలో జెమీమా మనీ పాకెట్ మరింత నిండుతుందేమో చూడాలి...!
