Begin typing your search above and press return to search.

కిషన్ సెలబ్రేషన్ వివాదం.. ‘విజిల్ పోడు’పై CSK ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏమైందంటే?

ఐపీఎల్ 2026లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

By:  Madhu Reddy   |   19 May 2026 12:04 PM IST
కిషన్ సెలబ్రేషన్ వివాదం.. ‘విజిల్ పోడు’పై CSK ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏమైందంటే?
X

ఐపీఎల్ 2026లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. అయితే,ఈ మ్యాచ్‌ కంటే కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెన్నై హోమ్ గ్రౌండ్‌లోనే వాళ్ల ఫేమస్ ‘విజిల్ పోడు’ స్టైల్‌ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది.దీంతో చెన్నై ఫ్యాన్స్ ఇషాన్ కిషన్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.

హైదరాబాద్ అదిరిపోయే విక్టరీ:

టాస్ గెలిచి బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్నటి మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన టార్గెట్‌ను ఐదు వికెట్ల తేడాతో ఛేదించి టోర్నమెంట్‌లో గ్రాండ్‌గాప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.హైదరాబాద్ టీమ్ విజయాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇషాన్ కిషన్ ఊచకోత:

ఈ మ్యాచ్‌ విజయంలో సన్‌రైజర్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లను ఆడుకుంటూ కేవలం కొన్ని బంతుల్లోనే 70 పరుగులు చేసి టీమ్‌ను గెలిపించాడు.ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినందుకు గాను ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

వివాదానికి కారణమైన సెలబ్రేషన్:

మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఇషాన్ కిషన్ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానమైన చెపాక్‌లోనే.. సిఎస్‌కె అఫీషియల్ స్లోగన్ అయిన ‘విజిల్ పోడు’ అంటే ఈల వేయండి అనే సైగను అనుకరిస్తూ ఇషాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది కాస్తా టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

షాకింగ్‌గా రియాక్ట్ అయిన సిఎస్‌కె ఫ్యాన్స్:

ఇషాన్ కిషన్ చేసిన ఈ పనికి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల గుండె మండిపోతోంది. ఇక మా గ్రౌండ్‌కు వచ్చి, మమ్మల్నే వెక్కిరిస్తావా? అంటూ సోషల్ మీడియాలో ఇషాన్ పై మండిపడుతున్నారు. ఇక ఇది ఎంతమాత్రం స్పోర్ట్స్ మ్యాన్‌షిప్ కాదని, గేమ్ స్పిరిట్‌కు విరుద్ధమని ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్‌లలో గెలుపోటములు, కాస్త అగ్రెసివ్ సెలబ్రేషన్స్ కామనే అయినప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ట్రేడ్‌మార్క్ స్లోగన్‌ను టార్గెట్ చేయడం మాత్రం ఎప్పుడూ వివాదాలకే దారితీస్తుంది. ఇక మరి ఈ 'విజిల్ పోడు' వివాదంపై ఇషాన్ కిషన్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి..