Begin typing your search above and press return to search.

క్రికెట్‌లో కొత్త సెన్సేషన్… అందం, ఆట రెండింట్లోనూ అదుర్స్!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక కొత్త క్రికెటర్ పేరు మారుమోగిపోతోంది.

By:  Madhu Reddy   |   16 Jun 2026 4:59 PM IST
క్రికెట్‌లో కొత్త సెన్సేషన్… అందం, ఆట రెండింట్లోనూ అదుర్స్!
X

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక కొత్త క్రికెటర్ పేరు మారుమోగిపోతోంది. ఆస్ట్రేలియా అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు ఆడుతున్న భారత సంతతి నటి 'ఇరా ఏరీ' ప్రస్తుతం క్రికెట్ అభిమానుల సరికొత్త క్రష్‌గా మారిపోయారు. మైదానంలో ఆమె చురుకుదనం, అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో పాటు ఆమెకున్న హీరోయిన్ కటౌట్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. అటు ఆటతో, ఇటు అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ క్రికెటర్ విశేషాలు చూద్దాం..

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న కొత్త క్రష్:

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఇరా ఏరీ సరికొత్త స్టార్‌గా అవతరించారు. సాధారణంగా క్రికెటర్లు అనగానే కేవలం ఆట గురించే మాట్లాడుకుంటారు. కానీ ఈమె విషయంలో ఆటతో పాటు ఆమె లుక్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక గ్రౌండ్‌లో షార్ట్స్ ధరించి ఆమె అటు ఇటు పరిగెడుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమెను చూసిన నెటిజన్లు "క్రికెట్ గ్రౌండ్‌లోకి హీరోయిన్ వచ్చినట్లుంది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భారత సంతతి అమ్మాయే:

ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ, ఇరా ఏరీ మూలాలు భారతదేశానికి చెందినవే. భారత సంతతికి చెందిన ఈ టీనేజ్ ప్లేయర్, ఆస్ట్రేలియాలో స్థిరపడి అక్కడ క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక విదేశీ గడ్డపై మన రక్తం ఉన్న అమ్మాయి ఇంతలా మెరిసిపోతుండటంతో భారతీయ అభిమానులు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బౌలింగ్‌లో సత్తా చాటుతోంది:

ఇరా ఏరీ కేవలం గ్లామర్‌తోనే కాదు, అంతకంటే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పుతోంది. రీసెంట్‌గా జరిగిన మ్యాచ్‌ల్లో ఆమె వేసిన బంతులకు ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు, అలాగే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టుకు అద్భుతమైన విజయాలను అందించింది.

గ్లామర్ క్వీన్ అంటూ నెటిజన్ల ఫిదా:

ఆమె ఆటను చూసిన విశ్లేషకులు ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక మంచి ఫ్యూచర్ స్టార్ దొరికిందని అంటుంటే, ఫ్యాన్స్ మాత్రం ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రాత్రికి రాత్రే అమాంతం పెరిగిపోయింది. స్పోర్ట్స్ నైపుణ్యంతో పాటు మోడల్‌కు ఏమాత్రం తీసిపోని లుక్స్ ఉండటంతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు కూడా ఆమె వైపు మునుముందు చూస్తారేమో..

అందం, ప్రతిభ ఒకేచోట చేరితే ఎలా ఉంటుందో ఈమెనుని చూస్తే అర్థమవుతుంది. కేవలం లుక్స్‌తోనే కాకుండా బంతితో మ్యాజిక్ చేస్తూ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదగడం నిజంగా గ్రేట్. త్వరలోనే ఈ భారత సంతతి అమ్మాయి అండర్-19 స్థాయి నుంచి సీనియర్ నేషనల్ టీమ్‌లోకి అడుగుపెట్టి మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం.