ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!
అయితే, స్టేడియం సీట్ల సంఖ్యతో పోలిస్తే ఏకంగా 247 రెట్లు ఎక్కువగా, సుమారు 83,97,294 (84 లక్షల) దరఖాస్తులు రావడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
By: Madhu Reddy | 3 Nov 2026 1:51 PM ISTక్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే దాయాదుల పోరుకు సంబంధించిన ఓ అద్భుతమైన రికార్డ్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఐసీసీ (ICC) టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన క్షణం నుంచే దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ మ్యాచ్ క్రేజ్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం..
కేవలం 34 వేల సీట్లు.. కానీ 84 లక్షల దరఖాస్తులు:
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న ప్రఖ్యాత 'ది వాండరర్స్' స్టేడియంలో 2027 అక్టోబర్ 10న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ కేవలం 34,000 మంది మాత్రమే. అయితే, స్టేడియం సీట్ల సంఖ్యతో పోలిస్తే ఏకంగా 247 రెట్లు ఎక్కువగా, సుమారు 83,97,294 (84 లక్షల) దరఖాస్తులు రావడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. త్వరలోనే ఈ రిక్వెస్టుల సంఖ్య కోటి దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్‌ను మించిన ఇండియా-పాక్ క్రేజ్:
ఇండియా-పాక్ మ్యాచ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇదే వేదికపై నవంబర్ 21న జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం 79 లక్షల దరఖాస్తులు రాగా.. గ్రూప్ స్టేజ్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కే ఏకంగా 84 లక్షలకు పైగా రిక్వెస్టులు రావడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్ కంటే కూడా దాయాదుల పోరుకే ఫ్యాన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది దీని ద్వారా స్పష్టమవుతోంది.
193 దేశాల నుంచి 12 కోట్ల టికెట్ రిక్వెస్టులు:
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల నుండి ఇప్పటివరకు ఏకంగా 12 కోట్ల పైగా టికెట్ రిక్వెస్టులు వచ్చాయి. ఇక క్రికెట్ చరిత్రలోనే టోర్నమెంట్ టికెట్ల కోసం ఈ స్థాయిలో రికార్డు స్థాయి స్పందన రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.
ఇక మొత్తానికి చూస్తే, "అట్లుంటది.. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే!" అన్నట్లుగా ఈ దాయాదుల సమరం మరోసారి ప్రపంచ క్రికెట్ అభిమానులను తన వైపు తిప్పుకుంది. ఇక సీట్ల పరిమిత సంఖ్య కారణంగా లక్షలాది మందికి నిరాశ ఎదురైనా, ఈ మ్యాచ్‌పై ఉన్న క్రేజ్ మాత్రం క్రికెట్ ఏ స్థాయిలో కలుపుతుందో మరోసారి నిరూపించింది.
