Begin typing your search above and press return to search.

టి20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌తీయం.. 35 మంది పైగా వివిధ జ‌ట్ల త‌ర‌ఫున

హార్డ్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా తన ప్ర‌పంచ క‌ప్ ప్ర‌యాణాన్ని అమెరికాతో మ్యాచ్ ద్వారానే మొద‌లుపెట్ట‌నుంది.

By:  Tupaki Political Desk   |   5 Feb 2026 7:00 AM IST
టి20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌తీయం.. 35 మంది పైగా వివిధ జ‌ట్ల త‌ర‌ఫున
X

ఈ నెల 7న జ‌రిగే భార‌త్-అమెరికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ను చూసి పొర‌పాటున ఇదేంటి? మైదానంలో అంతా మ‌నోళ్లే (భార‌తీయులే) ఉన్నారు అనుకునేరు? అస‌లు వీరే కాదు, క‌ప్ లో పాల్గొంటున్న వారిలో అనేక‌మంది భార‌త మూలాలు ఉన్న‌వారున్నారంటే ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు..! వ‌చ్చే శ‌నివారం నుంచి భార‌త్-శ్రీలంక సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో టీమ్ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ గా అడుగుపెడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ డిఫెండింగ్ చాంపియ‌న్ కూడా టి20 ప్ర‌పంచ‌ క‌ప్ ను నిల‌బెట్టుకోలేదు.

కానీ, భార‌త జ‌ట్టు మాత్రం ఈసారి ఆ రికార్డును త‌న ఖాతాలో వేసుకునేంత ప‌టిష్ఠంగా క‌నిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్ లో మ‌న జ‌ట్టు... అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ జ‌ట్టులో కెప్టెన్ మోనాక్ ప‌టేల్ స‌హా చాలామంది భార‌తీయులే కావ‌డం విశేషం. కెన‌డా, ఒమ‌న్ జ‌ట్ల కెప్టెన్లు దిల్ ప్రీత్ బ‌జ్వా, జ‌తీంద‌ర్ సింగ్ లూ భార‌తీయు మూలాలు ఉన్న‌వారే. మొత్త‌మ్మీద అన్ని జ‌ట్ల త‌ర‌ఫున టి20 ప్ర‌పంచ క‌ప్ లో 35 మంది పైగా భార‌తీయులు ఆడుతున్నారు.

ఆధార్ కార్డు వ‌ర్సెస్ గ్రీన్ కార్డు

హార్డ్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా తన ప్ర‌పంచ క‌ప్ ప్ర‌యాణాన్ని అమెరికాతో మ్యాచ్ ద్వారానే మొద‌లుపెట్ట‌నుంది. అటు అమెరికా జ‌ట్టులో ఎక్కువ‌మంది మ‌నోళ్లే కావ‌డంతో ఆ దేశ విశిష్ట‌తను తెలిపే గ్రీన్ కార్డుతో మ‌న ఆధార్ కార్డును పోలుస్తున్నారు. గ‌త నెల 15న‌ జ‌రిగిన అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ తొలి మ్యాచ్ లోనూ భార‌త్.. అమెరికాతోనే త‌ల‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు కూడా ఇదే పోలిక వ‌చ్చింది.

కెన‌డా నుంచి ఇట‌లీ వ‌ర‌కు...

ఈ టి20 ప్ర‌పంచ క‌ప్ లో హైలైట్ ఏమంటే ఇట‌లీ జ‌ట్టు. అస‌లు క్రికెట్ లో పేరే వినిపించ‌ని ఈ దేశం ఏకంగా ప్ర‌పంచ క‌ప్ అర్హ‌త సాధించింది. అలాంటి ఇట‌లీ జ‌ట్టులోనూ భార‌త సంత‌తికి చెందిన జ‌స్‌ప్రీత్ సింగ్ ఉన్నాడు. ఇక కెన‌డా జ‌ట్టులో తెలుగు వాడైన శ్రేయాస్ మొవ్వా స‌హా 9 మంది ఇండియ‌న్ ఆరిజ‌న్ వారే. ఒమ‌న్ జ‌ట్టులోనూ ఏడుగురు భార‌తీయు మూలాలున్న‌వారు. యూఏఈ జ‌ట్టులోనూ ఏడుగురు భార‌తీయ సంత‌తివారు ఉండ‌డం విశేషం. మొత్తం మీద జ‌ట్ల వారీగా చూస్తే కెన‌డా జ‌ట్టులో 11 మంది, అమెరికా టీమ్ లో 9 మంది ఇండియ‌న్ ఆరిజ‌న్ ప్లేయ‌ర్లు.

క్రికెట్ విశ్వ‌వ్యాప్తం.. భార‌తీయులు ప్ర‌పంచం అంతా

20 జ‌ట్లు పాల్గొంటున్న టి20 ప్ర‌పంచక‌ప్ లో 35 మందిపైగా భార‌తీయ మూలాలున్న ఆట‌గాళ్లు ఆడుతున్నారంటే క్రికెట్ ఎంతగా ప్ర‌పంచ వ్యాప్తం అయిందో తెలుస్తోంది. అంతేగాక భార‌తీయులు ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉంటూ త‌మకు అత్యంత‌ ఇష్ట‌మైన క్రికెట్ ను ఆయా దేశాల్లో బాగా పాపుల‌ర్ చేస్తున్నారు. ప్ర‌పంచ క‌ప్ లో పాల్గొనే స్థాయికి ఆ దేశాల జ‌ట్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.