వరల్డ్ కప్ టెన్షన్ మధ్య హార్దిక్ వివాదం… ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
T20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. నాకౌట్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
By: Madhu Reddy | 24 Feb 2026 3:21 PM ISTT20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. నాకౌట్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. జట్టు ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత విషయాల వల్ల నెటిజన్ల టార్గెట్‌గా మారారు. ఫామ్ అవ్వలేదని సతమతమవుతున్న హార్దిక్, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివరాలలోకి వెళితే..
BCCI నిబంధనలు బ్రేక్ చేశారా? అసలేం జరుగుతోంది:
సాధారణంగా ఐసీసీ టోర్నీల సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలని బీసీసీఐ (BCCI) ఒక కఠినమైన రూల్ పెట్టింది. ఇక జట్టుతో పాటు ప్రయాణించేటప్పుడు కుటుంబ సభ్యులను లేదా సన్నిహితులను వెంట తీసుకెళ్లకూడదనేది ఆ నిబంధన ఉద్దేశం. ఆటగాళ్లంతా వృత్తిపరంగా కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని బోర్డు భావిస్తుంది. అయితే, ప్రస్తుత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహైకతో కలిసి కనిపిస్తుండటం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. జట్టు మొత్తం ఒక వైపు ఉంటే, హార్దిక్ తన వ్యక్తిగత విషయాలతో బిజీగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం.. "అంత షో అవసరమా?" అంటూ కామెంట్స్:
ఇక భారత జట్టు గెలుస్తున్నంత కాలం ఇలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోరు. కానీ, జట్టు ఓడిపోతున్నప్పుడు మాత్రం ప్రతి చిన్న విషయం భూతద్దంలో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సరిగ్గా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. "ప్రపంచంలో గర్ల్ ఫ్రెండ్ ఉన్న ఏకైక వ్యక్తి హార్దిక్ పాండ్యానే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆటలో పస లేదు కానీ, షో ఆఫ్ మాత్రం తక్కువ లేదు" అంటూ ఒక నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశారు. జట్టుతో పాటు ఆమెను ఉంచడం, ఫోటోలకు ఫోజులివ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు.
పర్ఫార్మెన్స్ తగ్గితే.. విమర్శలు తప్పవు:
ఇక అసలు క్రికెట్‌లో ఫామ్ అనేది చాలా ముఖ్యం. హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోగా, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం జట్టు ఇమేజ్‌ను కూడా దెబ్బతీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ ప్లేయర్‌గా బాధ్యత తీసుకోవాల్సింది పోయి, వ్యక్తిగత విలాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఫ్యాన్స్ ఆరోపణ. అంటే ఒకవేళ హార్దిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే బహుశా ఈ చర్చ వచ్చేది కాదేమో! కానీ ఆటలో వెనుకబడటం, వ్యక్తిగత జీవితం తెరపైకి రావడంతో హార్దిక్ ఇప్పుడు నిప్పుల కుంపటి లో కూర్చున్నట్లయింది.
