Begin typing your search above and press return to search.

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

భారత్‌తో క్రికెట్ సిరీస్ లేకపోవడం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వచ్చే ఏడాది టీమిండియా పర్యటన లేకపోవడంతో ఐసీసీ చెల్లింపులు తగ్గడం సహా మొత్తం సుమారు రూ.627 కోట్ల ఆదాయ లోటు ఏర్పడినట్లు సమాచారం. 2027లో యాషెస్ సిరీస్ ఉన్నప్పటికీ ఈ లోటును భర్తీ చేయడం కష్టమని తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో భారత్ మార్కెట్ బలం మరోసారి స్పష్టమవుతోంది.

By:  A.N.Kumar   |   9 Nov 2026 9:55 AM IST
భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..
X

మనల్ని పాలించిన బ్రిటీషోళ్లకే మనం ఆదాయం ఇస్తున్నామంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజంగా నిజం.. దాదాపు 200 ఏళ్లకు పైగా మనల్ని నిరంకుశంగా పాలించి మన దగ్గర ఉన్న సంపదను అంతా దోచుకెళ్లిన బ్రిటీషోళ్లు ఇప్పుడు మనం లేనిదే బతకడం కాన కష్టమవుతోంది. అంతలా మన భారత్ డిమాండ్ ఉంది. మనతో ఆడకపోతే వారి బోర్డులన్నీ దివాళా తీసే పరిస్థితి. ప్రపంచ క్రికెట్ లో భారత్ ప్రభావం ఎంతనేది దీంతో అర్థమవుతుంది.

క్రికెట్ లో గెలుపోటములు అన్నవి ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జరిగిపోతుంటాయి. కానీ ఆదాయ వ్యయాలు బోర్డుల బలాన్ని నిర్ణయిస్తాయి. అసలు క్రికెట్ పుట్టిందే ఇంగ్లండ్ లో.. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులకు ఇప్పుడు తత్త్వం బోధపడుతోంది. ప్రపంచంలోనే పురాతన.. అత్యంత డిమాండ్ ఉన్న ‘యాషెస్’ సిరీస్ ద్వారా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులకు లాభాలు రావట్లేదట.. మైదానంలో ఎంతటి హోరాహోరీ పోరు జరిగినా ఆర్థికంగా మాత్రం భారత్ తో సిరీస్ కు ఉన్న క్రేజ్ ను అందుకోవడం అంత సులభం కాదని తాజాగా ఈ రెండు బోర్డులకు లెక్కల ద్వారా అర్థమైంది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు భారత్ తో సిరీస్ లేకపోవడంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు ఉన్న ప్రత్యేక కేవలం ఆటగాళ్ల ప్రతిభకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు టీమిండియా మ్యాచ్ లను వీక్షిస్తుంటారు. ముఖ్యంగా భారత్ విదేవీ పర్యటనలకు వెళ్లినప్పుడు బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు, స్పాన్సర్లు, ప్రకటనదారుల నుంచి భారీ ఆదాయం వస్తుంది. ఆతిథ్య దేశ క్రికెట్ బోర్డులకు ఇదొక పెద్ద ఆర్థిక వనరు. అయితే ఇంగ్లండ్ కు వచ్చే ఏడాది భారత్ తో సిరీస్ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతోంది. ఇంగ్లండ్ బోర్డు ఆదాయం భారీగా పడిపోతోంది. దీనికి తోడు ఐసీసీ నుంచి వచ్చే చెల్లింపులు కూడా రెవెన్యూ బ్యాలెన్సింగ్ లో తగ్గుతున్నాయట.. ఈ రెండింటి వల్ల ఇంగ్లండ్ బోర్డుకు సుమారు రూ.627 కోట్ల నష్టం వాటిల్లితోందని చెబుతోంది.

సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత క్రేజీ సిరీస్ అయిన యాషెస్ వల్ల కూడా ఇంగ్లండ్ కు ఆదాయం రావడం లేదట.. 2027లో యాషెస్ సిరీస్ ఉన్నా ఏమంత ఆదాయం ఇంగ్లండ్ కు రావడం లేదు. భారత్ తో సిరీస్ లేకపోవడం వల్లే ఆర్థిక లోటు భారీగా పడిపోయిందట.. అంటే క్రికెట్ లో సంప్రదాయ వైరం.. చారిత్రక పోటీలు ఉన్నా కూడా అవిప్పుడు ఆర్థికంగా బోర్డులకు ఆదాయం ఇవ్వడం లేదన్న మాట.. భారత్ తో సిరీస్ అయితేనే ఆయా బోర్డులకు ఆదాయం భారీగా వస్తుందన్న మాట..

గతంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులు ప్రపంచ క్రికెట్ ను ఏలేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్.. భారీ టెలివిజన్ మార్కెట్, డిజిటల్ వ్యూయర్ షిప్, ప్రకటనల ఆదాయంతో బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక బలమైన క్రికెట్ బోర్డుగా నిలబెట్టాయి. భారత్ ఆడే ప్రతి అంతర్జాతీయ సిరీస్ కు ఉన్న వాణిజ్య విలువ ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే టీమిండియా పర్యటన కోసం ఆతిథ్య దేశాలు ఇప్పుడు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. భారత్ తో మ్యాచ్ అంటే ప్రసార హక్కులకు ఉన్న డిమాండ్ నే దీనికి కారణం. స్టేడియాల్లో ప్రేక్షకులు భారీగా వస్తారు. అటు వైపునుంచి ఆదాయం వస్తుంది.

దీన్ని బట్టి అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ మార్కెట్ ఎంత బలంగా.. కీలకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు క్రికెట్ ను శాసించిన దేశాలు కూడా ఇప్పుడు భారత్ జట్టు పర్యటన కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడడం భారత్ క్రికెట్ సాధించిన విజయంగా చెప్పొచ్చు.