బెంగళూరు నుంచి ఆర్సీబీ మ్యచ్ ల తరలింపు.. డీకే సీరియస్ ప్రకటన
గత ఏడాది ఆర్సీబీకి ఒక సంతోషం.. మరో తీరని దు: ఖం మిగిల్చిన సంవత్సరం. అట తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంలో సంబరాల్లో విషాదం జరిగింది.
By: A.N.Kumar | 8 Dec 2025 8:57 AM ISTగత ఏడాది ఆర్సీబీకి ఒక సంతోషం.. మరో తీరని దు: ఖం మిగిల్చిన సంవత్సరం. అట తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంలో సంబరాల్లో విషాదం జరిగింది. 11 మంది ఆర్సీబీ అభిమానులు ఆర్సీబీ సంబరాల్లో చనిపోవడంతో దేశమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్సీబీపై.. దాని విజయయత్రపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఆర్సీబీ బాధ్యులను అరెస్ట్ చేసి విచారించారు.
దీంతో యాజమాన్యం కూడా టీంను అమ్మేయడానికి రెడీ అయ్యిందని.. ఫూణేకు మ్యాచ్ లను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం సాగింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కంగారు పడి సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ఆర్సీబీ మ్యాచులు బెంగళూరులో జరగవని.. ఫూణేకు మార్చబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలోనే ఖచ్చితంగా ఐపీఎల్ మ్యాచులు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరులోని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ సభ్యుడైన డీకే శివకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం చిన్న స్వామి స్డేటియంలోనే ఐఎల్ మ్యాచులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ‘చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్ లను తరలించడానికి మేం అనుమతించం. ఎందుకంటే ఇది బెంగళూర, కర్ణాటక రాష్ట్ర గౌరవానికి సంబంధించిన విషయం. ఐపీఎల్ ఇక్కడే జరుగుతుంది. నేను క్రికెట్ అభిమానిని.. భవిష్యత్తులో తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకుంటాం. స్టేడియం ఖ్యాతిని నిలబెట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యామ్మాయంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తాం అని డీకే స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలవడంతో 18 ఏళ్ల వారి తీరని ట్రోఫీ కల నెరవేరింది. అయితే గెలుపు తర్వాత ఆ జట్టు బెంగళూరులో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. విక్టరీ పరేడ్, చిన్న స్వామి స్డేడియంలో వేడుకలు ప్లాన్ చేయగా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి తొక్కిసలాట జరిగి 11మంది చనిపోయారు. పలువురు గాయపడ్డార. దీంతోనే బెంగళూరు నుంచి మ్యాచ్ లను ఈసారి తరలిస్తారనే ప్రచారం జరగగా.. డీకే శివకుమార్ ఖండిస్తూ బెంగళూరులోనే జరుపుతామని ప్రకటించారు.
