ట్రెండీ స్టోరి: రెండో పెళ్లితో సెటిల్ అయిన టాప్-10 క్రికెటర్లు
క్రికెటర్ల జీవితాల్లో `రెండో ఇన్నింగ్స్` ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ రెండో పెళ్లి వార్తలే ట్రెండింగ్‌లో ఉన్నాయి.
By: Sivaji Kontham | 24 Feb 2026 1:00 AM ISTక్రికెటర్ల జీవితాల్లో `రెండో ఇన్నింగ్స్` ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ రెండో పెళ్లి వార్తలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ వివరాలతో పాటు రెండోసారి పెళ్లి చేసుకున్న ఇతర దిగ్గజ క్రికెటర్ల వివరాలు పరిశీలిస్తే..
శిఖర్ ధావన్ - సోఫీ షైన్ (ఐర్లాండ్)
టీమిండియా మాజీ ఓపెనర్, `గబ్బర్` శిఖర్ ధావన్ ఫిబ్రవరి 21న తన ప్రియురాలు సోఫీ షైన్ ను వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ఐర్లాండ్ దేశానికి చెందిన యువతి. దుబాయ్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో పనిచేస్తూనే, ప్రస్తుతం ధావన్ ఏర్పాటు చేసిన `డా వన్ స్పోర్ట్స్`.. `శిఖర్ ధావన్ ఫౌండేషన్` వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసరాల్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. వీరిద్దరూ గత ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో పెళ్లి చేసుకున్న భారతీయ క్రికెటర్లు
వ్యక్తిగత కారణాలతో విడిపోయి, ఆ తర్వాత రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ల వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ దినేష్ కార్తీక్.. మొదటి భార్య నికిత వంజర నుంచి విడిపోయాక దీపికా పల్లికల్ ని పెళ్లాడారు. దీపికా ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి. ప్రస్తుతం వీరిద్దరూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా ఉన్నారు. యోగ్ రాజ్ సింగ్ మొదటి భార్య షబ్నం సింగ్ నుంచి విడిపోయాక సత్బీర్ కౌర్ ని పెళ్లాడారు. తండ్రి యోగరాజ్ రెండో పెళ్లి గురించి, తండ్రితో తన సమీకరణం గురించి యువరాజ్ సింగ్ ఓపెన్ గా చెప్పారు.
మహ్మద్ అజారుద్దీన్ ..నౌరీన్ నుంచి విడిపోయాక సంగీత బిజిలానీ ని పెళ్లాడారు. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 1996లో నటి సంగీతను వివాహం చేసుకున్నారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మొదటి భార్య జ్యోత్స్న నుంచి విడిపోయాక మాధవి పాత్రవళిని 2008లో పెళ్లాడారు. మాధవి పాత్రికేయురాలు.
వినోద్ కాంబ్లీ తన భార్య నోయెల్ లూయిస్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత ఆండ్రియా హెవిట్ ని పెళ్లాడారు. ఆండ్రియాతో పెళ్లి తర్వాత కాంబ్లీ క్రైస్తవ మతంలోకి మారారు. అరుణ్ లాల్ తన మొదటి భార్య రీనా నుంచి విడిపోయాక బుల్బుల్ సాహాను పెళ్లాడారు. 2022లో తన 66వ ఏట బుల్బుల్ సాహాను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు.
విదేశీ క్రికెటర్లు - రెండో పెళ్లి ముచ్చట్లు
విదేశీ క్రికెటర్లలో కూడా చాలామంది రెండో పెళ్లి తర్వాత చాలా సంతోషంగా జీవిస్తున్నారు. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) తన మొదటి భార్య ఎలిజబెత్ కెంప్‌తో విడాకుల తర్వాత, 2014లో లానా ఆండర్సన్ ను వివాహం చేసుకున్నారు. జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా) .. కేట్ మెక్‌కార్తీతో విడిపోయిన తర్వాత 2014లో మెలానీ వోల్ఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి పుట్టిన పాపకు ఇండియా అని పేరు పెట్టడం విశేషం. షోయబ్ మాలిక్ (పాకిస్థాన్).. సానియా మీర్జాతో విడాకుల తర్వాత 2024లో నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నారు. ఇది ఆయనకు మూడో వివాహం అని కూడా కొందరు అంటారు. వసీం అక్రమ్ (పాకిస్థాన్).. మొదటి భార్య హుమా మరణం తర్వాత, ఆస్ట్రేలియాకు చెందిన షానీరా థాంప్సన్ ను 2013లో వివాహం చేసుకున్నారు.
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా).. భార్య జేన్ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత, 2010లో సారా లియోనార్డిని వివాహం చేసుకున్నారు. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)..ఇటీవల 2025లో రెండో వివాహం చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి పెళ్లి చేదు అనుభవం మిగిల్చినప్పటికీ వీరందరూ రెండో పెళ్లితో కొత్త ఆనందాన్ని వెతుక్కున్నారు.
