Begin typing your search above and press return to search.

ఈ ప‌థ‌కంపైనే జ‌గ‌న్ ఆశ‌లు.. ఏమేర‌కు నెర‌వేరుతాయో..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:15 PM GMT
ఈ ప‌థ‌కంపైనే జ‌గ‌న్ ఆశ‌లు.. ఏమేర‌కు నెర‌వేరుతాయో..!
X
ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు సీఎం జ‌గ‌న్ అనేక ప‌థ‌కాలు తీసుకువ‌చ్చారు. అనేక కార్య‌క్ర‌మా లు కూడా అమ‌లు చేశారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. అయితే.. వీటి ఫ్లేవ‌ర్ అప్ప‌టిక‌ప్పుడు బాగానే ఉంద‌ని అనిపించినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. త‌గ్గుతూ వ‌చ్చింది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. పార్టీ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన చందంగా మారిపోయింది. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చిన‌ప్పుడు పార్టీ పేరు మార్మోగింది.

ఇక‌, ఈ వ‌లంటీర్ల‌ను పార్టీకోసం వినియోగిస్తున్నార‌నే ప్ర‌చారం క్లిక్ కావ‌డంతో ఇది కాస్తా దారిత‌ప్పింది. పింఛ‌న్లు పెంచినా.. అప్ప‌టికే జ‌రిగిన వ్య‌తిరేక ప్ర‌చారం.. పింఛ‌న్లు తీసేస్తున్నార‌నే వాద‌న‌ల నేప‌థ్యంలో పెంచిన పింఛ‌న్లు పార్టీకి సానుకూలంగా మార్చుకోలేక పోయారు. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాలు ఇస్తున్నా.. ర‌హదారు ల గుంత‌లు.. ప్రాజెక్టుల ప‌డ‌క వంటివి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీని నుంచి పార్టీని కాపాడుకునేందు కు గృహ సార‌థులు కాన్సెప్టును తీసుకువ‌చ్చారు.

అయినా.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియ‌డం లేదు. మ‌రోవైపు గ‌తంలో వైఎస్ అవలంబించిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని పాశుప‌తాస్త్రంగా వినియోగించాల‌ని జ‌గ‌న్ భావించారు. దీనిలో లెక్క‌లేన‌న్ని చికిత్స‌లు తీసుకువ‌చ్చి పెట్టారు. ఇది కొంత ఫ‌ర్వాలేద‌ని అనిపించినా.. ఎక్క‌డో డౌట్ కొడుతోంది. ఇక‌, ఈ నేప‌థ్యంలో ఆరోగ్య శ్రీకి బూస్ట్ మాదిరిగా.. ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్టును జ‌గ‌న్ ప్ర‌వేశ పెడుతున్నారు. దీనిపై చాలానే అంచ‌నాలు ఉన్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్టును మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌తి కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య విష‌యాల‌ను డాక్ట‌ర్ చూస్తారు. ప్ర‌తి యాభై ఇళ్ల‌కు ఒక డాక్ట‌ర్‌ను కేటాయిస్తారు. ప్ర‌తి కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను రికార్డు చేసుకుని.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా..ఫోన్ చేయ‌గానే ఇంటికి వ‌చ్చి వైద్యం అందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ నేప‌థ్యంలో ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. వైసీపీ ఓటు బ్యాంకుకు తిరుగు ఉండ‌ద‌నే దీమాతో ఉన్నారు. మ‌రి ఏమేర‌కు ఈ ప‌థ‌కం స‌క్సెస్ అవుతుందో.. ఈలోగా ప్ర‌తిప‌క్షాలు ఏరేంజ్‌లో దూకుడు పెంచుతాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.