95 ఏళ్ల వయస్సులో ఒక్కటైన యువజంట !

Wed Jun 09 2021 20:00:02 GMT+0530 (IST)

young couple at 95 years old

జీవితంలో మనకి నచ్చినట్టు జీవించడం అనేది అందరికి దాదాపుగా అసాధ్యం. సాధారణంగా మనిషి జీవిత కాలం వందేళ్లు. ఇక మన జీవితానికి అది ఆడ అయినా మగ అయినా తోడు తప్పనిసరి. మనకి ఎవరో ఒకరు తోడు లేకుండా జీవిత పయనం సాగదు. అందుకే  వివాహ వ్యవస్థ. ఎదో శారీరక అవసరాల కోసం పుట్టిన వ్యవస్థ కాదది. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా కష్టంలో సుఖంలో పెనవేసుకునే బంధంగా ఉండాలనేది దాని అర్ధం. మరి యుక్త వయసులోనే ఒకరికి ఒకరి తోడు అవసరం అవుతుందా కానేకాదు. నిజానికి నిజమైన తోడు ఉండాల్సింది వయసు మళ్ళిన తరువాతే.కాకపొతే దురదృష్టవశాత్తూ చాలా మంది వృద్ధాప్యం దగ్గరకొచ్చేసరికి వారి సహచరులను కోల్పోయి ఒంటరి అయిపోతారు. జాయ్ మోరో నాల్టన్ నిత్యం డైరీ రాస్తుంది. కాని న్యూయార్క్ లో జాన్ షుల్ట్జ్ జూనియర్ తో కలిసి ఆమె మొదటి భోజన తేదీని ఇప్పటికీ ఆమె గుర్తుంచుకోలేదు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. మే 22 న వారిద్దరికీ వివాహం జరిగింది. ఆ పెద్ద వరుడు తన పుట్టిన రోజును కూడా అదే రోజు జరుపుకున్నాడు. ఈ వయసులో పెళ్లి ఏమిటీ అని బుగ్గలు నొక్కుకునే వారికి మాకు 5 సంవత్సరాలు మిగిలి ఉంటే ఈ సమయాన్ని ఎందుకు కలిసి గడపకూడదు అని జాయ్ చెప్పాడు. జాయ్ కొడుకు జాన్ మోరో ఇద్దరూ కలిసి అందంగా కనిపిస్తారు అని చెప్పడం అతని విశాల హృదయాన్ని ప్రదర్శిస్తుంది. జాయ్ షుల్ట్జ్ ఇద్దరూ మే 1926 లో జన్మించారు.

60 సంవత్సరాల వివాహం గడిపిన తరువాత వారిద్దరూ సహచరులను కోల్పోయారు. ఇప్పటివరకూ ఇద్దరూ తమ ఇళ్లలో ఒంటరిగా నివసించారు. తాజాగా శ్రీమతిగా మారిన జాయ్ మోరో న్యూయార్క్ లోని టిల్సన్‌లో నివసిస్తుండగా ఆమె శ్రీవారు షుల్టెస్ సమీపంలోని హర్లీలో నివసిస్తున్నారు. షుల్ట్జ్ 2020 లో ఒక వ్యవస్థాపకుడిగా పదవీ విరమణ చేశారు. జాయ్ ఇలా అంటారు మేమిద్దరం ఒకరినొకరు చాలా కాలంగా తెలుసు. తరచూ బహిరంగ ప్రదేశాల్లో కలుసుకునేవాళ్ళం. జాన్ ఉల్లాసంగా ఉంటాడు అలాగే అతనికి ఇతరులను ఎలా ఆకట్టుకోవాలో తెలుసు అంటూ తన భర్త గురించి చెప్పారు. మరోవైపు షుల్ట్జ్ .. ఆమె చాలా అందమైనది తెలివైనది. ఆమె హాస్య భావన అద్భుతమైనది. నేను వివాహం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నవ్వింది అంటూ మెరిసిపోతున్న కళ్ళతో జాయ్ గురించి చెప్పుకొచ్చారు. మోరో ముగ్గురు మనవరాళ్ళు ఐదుగురు మునుమనవళ్లను కలిగి ఉన్నారు. షుల్ట్జ్ కు 10 మంది మనవరాళ్ళు ఐదుగురు మునుమనవళ్ళు ఉన్నారు. ఆనందంగా బ్రతకాలి అనుకోవాలే కానీ దానికి వయసు అడ్డంకి కాదు కదా.