Begin typing your search above and press return to search.

ద‌స‌రా త‌ర్వాతి రెండోరోజున ఆత్మ‌హత్య‌ల లెక్క తెలుసా?

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:30 AM GMT
ద‌స‌రా త‌ర్వాతి రెండోరోజున ఆత్మ‌హత్య‌ల లెక్క తెలుసా?
X
ప‌ల్లె, ప‌ట్నం తేడా లేకుండా ద‌స‌రా సంద‌డి సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 8వ తేదీ జ‌రిగే ఈ పండుగ‌కు ఇప్ప‌టికే హైద‌రాబాద్ వాసులు సొంతూరికి చేరుకున్నారు. అక్టోబ‌ర్ 8వ ద‌స‌రా పండుగ కాగా అక్టోబ‌ర్‌ 10వ తేదీ ప్ర‌త్యేక‌త గురించి తెలుసుకోవాల్సిన అంశం ఇది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్‌ సంస్థ అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తోంది. ఈ రోజు గురించి మ‌నం ఎందుకు చెప్పుకోవాలంటే...మ‌న‌దేశంలో మానసికంగా కృంగిపోయి ఏటా 2.2 ల‌క్ష‌ల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబ‌ట్టి.

ఏడాదికి 8 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగామానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వ‌రల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెప్తున్నాయి. ప్ర‌పంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో నాలుగోవంతు మరణాలు భారత్‌లోనే జరుగుతున్నాయని లెక్క‌లు స్ప‌ష్టం అవుతున్నాయి. 2.2 లక్షల మంది ఇలా భార‌త్‌లో చ‌నిపోతున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉన్నవారు ఒత్తిడిని తట్టుకోలేక, మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వివ‌రించింది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1992 నుంచి ఈ దినం నిర్వ‌హిస్తోంది. మానసికంగా కృంగిపోతున్న వారిలో అవగాహన కల్పించడం, ఒత్తిడి స్ట్రెస్‌ను ఎలా తట్టుకోవాలో తెలియ‌జేస్తూ వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌ పలు అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. మానసికంగా కృంగిపోయి సంభ‌విస్తున్న మ‌ర‌ణాల్లో భార‌త్‌లోని వారి సంఖ్య సైతం ఆందోళ‌న క‌లిగించే అవ‌కాశం. ఈ ప‌రిస్థితి దూరం అవ్వాలంటే...ఆత్మీయ‌ కుటుంబ సంబంధాలు, మంచి స్నేహితులు, పుస్త‌క ప‌ఠ‌నం, ధ్యానం వంటివి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.