నిందితుడు రాజు ఆత్మహత్య: ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?

Thu Sep 16 2021 13:32:35 GMT+0530 (IST)

witness About Raju Suicide

సైదాబాద్ లో బాలికను రేప్ చేసి చంపిన నిందితుడు రాజు కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్న వేళ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేసు ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు గమనించారు.

నగర నడిబొడ్డులోని సైదాబాద్-సింగరేణి కాలనీలో హత్యాచారం చేశాక రాజు తప్పించుకున్నాడు. అతడు చివరి సారి ఉప్పల్ లో కనిపించాడు. తర్వాత అతడి ఆచూకీ కోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు. చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ ఉందనే సమాచారంతో స్పాట్ కు పోలీసులు వెళ్లారు. రాజు చేతిపై ఉన్న టాటూ చూసి అతడేనని నిర్ధారించారు.

రాజు ఆత్మహత్యకు ముందు తమకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని నస్కల్ రైల్వే ట్రాక్ మెన్ కుమార్ తెలిపారు. తమను చూసి అతను పొదల్లోకి వెళ్లిపోవడంతో ఎవరో అనుకున్నామన్నారు.

తాము కొద్దిదూరం వెళ్లిన తర్వాత 8.40 సమయంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఓ వ్యక్తి చనిపోయాడని రైతులు చెప్పినట్లు ట్రాక్ మెన్ తెలిపారు. దీంతో తాము రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు. వారు వచ్చి రాజుగా నిర్ధారించినట్లు చెప్పారు.