Begin typing your search above and press return to search.

భర్త స్నేహితులతో వివాహేతర సంబంధాలు..: చివరికి అతన్ని చంపించి..

By:  Tupaki Desk   |   18 May 2022 4:30 PM GMT
భర్త స్నేహితులతో వివాహేతర సంబంధాలు..: చివరికి అతన్ని చంపించి..
X
కాలం మారుతున్న కొద్దీ మానవ సంబంధాలు మట్టిగలిసిపోతున్నాయి. ముఖ్యంగా భార్యభర్తల సంబంధాలు భ్రష్టు పడుతున్నాయి. ఏడు జన్మలు కలిసుండాలని ఏడడుగులు నడిచిన వారు ఏడు నెలలు కూడా కలిసి జీవించడం లేదు. దంపతుల్లో ఎవరో ఒకరు దుర్భుద్ది కలిగి ఎవరో మరొకరి ప్రాణాలు తీసి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకొని జీవితాంతం తోడుండాల్సిన వారినే అంతం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొందరు ఆడవాళ్లు పెళ్లైన తరువాత కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భర్తలను హతమారుస్తున్నారు. తాజాగా ఓ లేడీ తన భర్త స్నేహితులతో సంబంధాలు పెట్టుకొని అడ్డుగా ఉన్న తన భాగస్వామినే చంపించేసింది. అయితే తన అతి తెలివితో తప్పించుకు తిరగాలని చూసింది. కానీ చేసిన తప్పుకు ఎన్నిటికైనా శిక్ష అనుభవించక తప్పదు. అందుకే పోలీసులు ఆమెను వెంటాడి పట్టుకొని జైలుకు పంపించేశారు.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అస్బాక్ మోన్ అంతర్జాతీయ బైక్ రైడర్. ఈయనను సుమేరా అనే అమ్మాయి పెళ్లిచేసుకుంది. అస్బాక్ మోన్ 2018లో అనుకోకుండా రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో అప్పుడున్న ఆధారాలతో రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తరువాత కేసును మూసివేశారు.

అయితే 2020లో ఈ కేసును అనుకోకుండా రీఓపెన్ చేయాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని మరోసారి పోస్టుమార్టం రిపోర్టును జిల్లా ఎస్పీ పరిశీలించారు. దీంతో విచారించిన పోలీసులకు అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్టులో అస్బాక్ మోన్ మెడ విరిగినట్లు ఉండడంతో అనుమానం కలిగింది. దీంతో ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని నిర్దారించుకున్నారు.

అస్బాక్ మోన్ మోన్ మరణించిన తరువాత ఆయన అకౌంట్ నుంచి కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ జరిగాయి. అంతేకాకుండా ఈయన మరణం తరువాత అతని స్నేహితులతో సుమేరా గంటల కొద్దీ మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో సుమేరా మాట్లాడిన వ్యక్తులను విచారణకు పిలిచారు.

కానీ వారు హాజరు కాలేదు. దీంతో హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుమేరాతో పాటు సంజయ్, విశ్వాస్ లను నిందితులుగా చేర్చారు. ఆ తరువాత విచారించిన పోలీసులకు అనేక విషయాలు తారసపడ్డాయి. సుమేరా చాలా మందితో వివాహేతర సంబంధాలు కొనసాగించేదని, అస్బాక్ మోహన్ స్నేహితులతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుందని పోలీసులకు ఆధారాలు లభించాయి.

కొన్ని రోజుల తరువాత సుమేరా వివాహేతర సంబంధాల విషయాలు అస్బాక్ కు తెలిశాయి. దీంతో అతన్ని అంతమొందించేందుకు అస్బాక్ స్నేహితుల సాయం తీసుకుంది. అయితే సంజయ్, విశ్వాస్ లు అదుపులోకి తీసుకున్న తరువాత సుమేరా పరారయింది. సిమ్ లు మారుస్తూ దేశంలో పలు చోట్ల తలదాచుకుంది. చివరకు పోలీసులు ఫోన్ కాల్ ట్రేస్ చేసి ఈనెల 13న సాయంత్రం బెంగుళూర్లో పట్టుకున్నారు. ఆ తరువాత ఆమెను జైలుకు పంపించారు.