Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ క‌విత చొర‌వ‌.. క‌న్నవారి వ‌ద్ద‌కు చేరిన వ్య‌‌క్తి

By:  Tupaki Desk   |   26 May 2020 8:10 AM GMT
మాజీ ఎంపీ క‌విత చొర‌వ‌.. క‌న్నవారి వ‌ద్ద‌కు చేరిన వ్య‌‌క్తి
X

మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభించి దేశ‌మంతా స్వీయ నిర్బంధం విధించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో విదేశాల నుంచి రాక‌పోక‌లు నిషేధించారు. అయితే తీవ్ర ఆంక్ష‌ల మ‌ధ్య వారిని అనుమ‌తిస్తున్నారు. అలా వ‌చ్చిన వారిని క‌చ్చితంగా పెయిడ్ క్వారంటైన్‌లో ఉండేలా చేశారు. అలా స్వదేశానికి చేరిన ఓ వ్య‌క్తి త‌న భార్య‌, కూతురు‌ చేయడంతో శ్రీనివాస్‌ను నాంపల్లిలోని ఓ హోటల్‌లో ఉంచారు. వేల కిలోమీట‌ర్ల నుంచి కొద్దిదూరంలోనే స్తంభించిపోవ‌డంతో విష‌యం తెలుసుకున్న మాజీ ఎంపీ క‌విత స్పందించి అత‌డిని స్వ‌గ్రామానికి ప్ర‌త్యేక వాహ‌నంలో త‌ర‌లించే ఏర్పాట్లు చేసి వారి కుటుంబానికి చేరువ చేశారు.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన పోతరాజు శ్రీనివాస్‌ రెండున్నరేళ్ల కింద‌ట ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. ఈయనకు భార్య సుజాత (38), కూతుళ్లు కావ్య (19), వైష్ణవి (17) ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్ర‌మాదంలో భార్య సుజాత, పెద్ద కూతురు కావ్య దుర్మరణం చెందారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో వారి అంత్య‌క్రియ‌ల‌ను అదే రోజు అతికొద్ది మంది మధ్య నిర్వ‌హించారు. అయితే ఆ స‌మ‌యంలో దుబాయిలో ఉన్న శ్రీనివాస్‌ వాట్సప్‌ వీడియో కాల్‌లో వారి అంత్య‌క్రియ‌లు చూసిన దౌర్భాగ్యం. అయితే స్వ‌దేశానికి వ‌చ్చే అవ‌కాశం ఉన్నా శ్రీనివాస్ జేబులో రూపాయి లేదు. దీంతో అక్క‌డి ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ సభ్యులు ఎంబసీ అధికారులతో మాట్లాడి అత‌డిని భార‌త్ పంపించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో టికెట్ కొనుగోలు చేసి ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌ కు పంపారు. అయితే నిబంధనల మేరకు విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌ లో ఉండాల‌ని ఉండ‌డంతో శ్రీనివాస్ నాంపల్లిలోని ఓ హోటల్‌ లో అధికారులు క్వారంటైన్ చేశారు.

ఇంత దూరం వ‌చ్చినా ఇంటికి చేరుకోక‌ పోవ‌డంతో అత‌డు తీవ్రంగా కుమిలి పోయాడు. ఈ స‌మ‌యంలోనే వారి పెద్ద‌క‌ర్మ కార్య‌క్ర‌మం ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న దుబాయ్‌లోని అత‌డి స్నేహితులు మాజీ ఎంపీ క‌విత‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వ అధికారుల‌తో మాట్లాడి క‌విత ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి అత‌డిని హైదరాబాద్‌ నుంచి లక్సెట్టిపేటకు పంపారు. అక్క‌డ‌కు వెళ్లి భార్య‌, పెద్ద కుమార్తె పెద్ద‌క‌ర్మ‌లో పాల్గొన్నాడు. చిన్న కూతురును పది మీటర్ల దూరం నుంచి చూసి ఓదార్చాడు. దూరం నుంచే కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడాడు. ఆ త‌ర్వాత‌ మళ్లీ హైదరాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రానికి శ్రీనివాస్ చేరుకున్నాడు.

క్వారంటైన్ పూర్త‌యిన అనంత‌రం ఇంటికి వెళ్లి త‌న బిడ్డ వైష్ణవి, తల్లి లక్ష్మమ్మను చూసుకుంటూ ఇక్క‌డే ఉంటాన‌ని, దుబాయ్ మ‌ళ్లీ వెళ్ల‌న‌ని శ్రీనివాస్ చెప్పాడు. మళ్లీ ఆటో నడుపుకుంటూ బతుకుతాన‌ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా క‌విత‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.