Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో సేవలు ఎందుకు ఆగిపోయాయి !

By:  Tupaki Desk   |   5 Jan 2021 7:23 AM GMT
హైదరాబాద్ మెట్రో సేవలు ఎందుకు ఆగిపోయాయి !
X
హైదరాబాద్ ‌కి తలమానికం మెట్రోరైల్ సర్వీసులు. ఈ మెట్రో రైళ్లు వచ్చాక, రోజూ లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుతున్నారు. ఇలాంటి మెట్రో రైళ్లలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే, అది అందరికీ ఇబ్బంది కరమే. తాజాగా మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్, రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్లు ముందుకు కదలలేదు. అలాగే , అసెంబ్లీ, అమీర్‌ పేట్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల 30 నిమిషాలుగా అధికారులు మెట్రో సేవలను నిలిపివేశారు.

ఈ క్రమంలోనే అమీర్‌పేట్ వైపు వెళ్లే మెట్రో రైలును అసెంబ్లీ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మెట్రోలో చిక్కుకుపోవడం వల్ల ఆఫీసుకు సకాలంలో వెళ్లే అవకాశం లేకుండా పోయిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ విధంగా సాంకేతిక లోపంతో మెట్రో సేవలకు అంతరాయం కలగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు మెట్రో సిబ్బంది ఎక్కువ సమయం తీసుకుంటున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మెట్రో అధికారులు ఇంకా స్పందించలేదు. మెట్రో సేవలు అడిగిపోవడం ఇదే తొలిసారి కాదు ..గతంలో కూడా పలుమార్లు రైళ్లు ఆగిపోయాయి.

అయితే , ఓ పెద్ద ప్రాజెక్టు చేపట్టాక, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం సహజమే. మెట్రో రైళ్లే లేకపోతే... హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యలు మరింత పెరిగేవే.