Begin typing your search above and press return to search.
కన్నడ డీకే శివకుమార్ ను షర్మిల ఎందుకు కలిసింది? అసలు కథేంటి?
By: Tupaki Desk | 16 May 2023 9:42 PM GMTతెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన ఆంధ్రా ఆడకూతురు, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెగ కష్టపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3వేలకు పైగా కి.మీల పాదయాత్ర చేసినా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదన్న టాక్ వినిపిస్తోంది. నాన్న వైఎస్ఆర్ క్రేజును నమ్ముకొని మాత్రమే షర్మిల రాజకీయం చేస్తోంది. అయితే అది వర్కవుట్ కావడం లేదన్న ప్రచారం ఉంది. అందుకే కొత్త దారుల్లో షర్మిల రాజకీయం చేస్తోందని.. పాపులారిటీ కోసం ప్రయత్నిస్తోందన్న వాదన రాజకీయవర్గాలు, సోషల్ మీడియాలో సాగుతోంది.
ఇటీవల కేసీఆర్ సర్కార్ పై ఒంటికాలిపై లేస్తున్నారు మన షర్మిల. కేసీఆర్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యారు. ఏకంగా ఆమెను కారుతో సహా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం తద్వారా జరిగిన హంగామా బాగా ఫోకస్ అయ్యి షర్మిలకు మంచి గుర్తింపు దక్కింది. జనాల్లో నానింది.
ఆ తర్వాత తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లేఖలు రాసి కేసీఆర్ పై పోరాడుదామని ఈమె ఇచ్చిన పిలుపు తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. సంచలనాల కోసం.. తన పేరు తెలంగాణలో నానడం కోసమే షర్మిల ఇలా చేస్తోందన్న ప్రచారం సాగింది. మొన్నటికి మొన్న సీపీఎం ఆఫీసుకెళ్లి మరీ తమ్మినేనిని తిట్టడం వెనుక రాజకీయం ఇదేనంటారు. వార్తల్లో నిలవడానికే జనాల్లో ప్రాముఖ్యత కోసమే షర్మిల ఇలా చేస్తోందన్న ప్రచారం ఉంది.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగా షర్మిల స్పందించారు. కర్ణాటకలో విజయం కోసం కృషి చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారని కొనియాడారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. డీకే శివకుమార్ తో మాకు ముందు నుంచి పరిచయం ఉంది. వైఎస్ఆర్ ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు. వైఎస్ఆర్ లా కష్టపడ్డాడు కాబట్టి కర్ణాటకలో అధికారంలోకి వచ్చాడు. ఆయన లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదని షర్మిల అన్నాడు. అందుకే శివకుమార్ ను కలిసి అభినందనలు తెలియజేశానని చెప్పారు.
పనిలో పనిగా కేసీఆర్ రాజకీయాలపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. డీకే శివకుమార్ నే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుక కష్టపడ్డారని.. కాంగ్రెస్ ను గెలిపించారని.. ఆయనను ఆకాశానికెత్తేశారు.
అయితే డీకే శివకుమార్ ను షర్మిల కలవడం వెనుక తండ్రి వైఎస్ఆర్ తో స్నేహం అనే కాదు.. అంతకు మించిన రాజకీయం ఉండొచ్చని రాజకీయవర్గాలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఎంత గట్టిగా .. నిజాయితీగా ప్రయత్నించినా షర్మిలకు బజ్ రావడం లేదని.. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ లో మంచి పొందేందుకు ఆలోచిస్తోందా? అన్న ఒక ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది.
అయితే డీకే శివకుమార్ ను కలవడం కేవలం వైఎస్ఆర్ తో అనుబంధం వల్లనేనని షర్మిల క్లారిటీ ఇచ్చింది. అంతకుమించి లేదంటోంది. కానీ తెరవెనుక రాజకీయం సాగుతోందన్న గుసగుసలు రాజకీయవర్గాలు, సోషల్ మీడియాలో సాగుతోంది. ఈ ఊహాగానాలు నిజమా? షర్మిల అడుగులు ఎటువైపు అన్నది వేచిచూడాలి.